spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 : థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై సుకుమార్ అసంతృప్తి..ఇలా అయితే...

Pushpa 2 : థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై సుకుమార్ అసంతృప్తి..ఇలా అయితే ‘పుష్ప 2’ కష్టమే!

Pushpa 2 :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో వంద మిలియన్ కి పైగా వ్యూస్ ని దక్కించుకున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ కారణంగా సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తప్పుకోవడం అభిమానులను కాస్త నిరాశకి గురి చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన రెండు అద్భుతమైన పాటలు ఇండియా వైడ్ గా ఎలా హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కానీ సుకుమార్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. ఆడియన్స్ ఇప్పటి వరకు అనుభూతి చెందని సౌండింగ్ ని ఆయన కోరుకున్నాడు. కానీ దేవి శ్రీ ప్రసాద్ నుండి అలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాలేదు. ఎన్ని ట్రాక్స్ కంపోజ్ చేసి ఇచ్చినా సుకుమార్ కి నచ్చడం లేదు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ని సినిమా నుండి తప్పించి, కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని పెట్టుకున్నాడు సుకుమార్. 15 రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం పూర్తి చేయాలనీ ఆయనకీ చెప్పారట. కానీ అంత తొందరగా అసలు కుదరదు సార్, నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడట. ఇటీవలే ఆయన ఫస్ట్ హాఫ్ మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని పూర్తి చేసాడట. రీసెంట్ గానే దీని రషస్ చూసిన సుకుమార్, పెద్దగా సంతృప్తి చెందలేదని సమాచారం.

కొన్ని కీలకమైన సన్నివేశాలకు మరోసారి రీ వర్క్ చేయాలసిందిగా కోరాడట. సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం ఉంది. ఇక్కడ రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులు పూర్తి కాలేదు. మరోపక్క హైదరాబాద్ లో ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఒక సాంగ్ షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉందట. చూస్తూ ఉంటే సినిమా విడుదలకు ముందు రోజు వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉండేట్టు ఉన్నారు. ఇలా అయితే ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. పుష్ప పార్ట్ 1 అప్పుడు కూడా ఇంతే, చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉన్నాడు సుకుమార్. ఆయన ప్రతీ సినిమాకి ఇంతే, ఈ పాటికి నేషనల్ లెవెల్ లో ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఇంకా షూటింగ్ లో బిజీ గా గడపడంని చూస్తుంటే అభినుల్లో కొత్త కొత్త టెన్సన్స్ పుట్టుకొస్తున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper