UP by-election : అధికార భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానంలో గెలిచే అవకాశం ఉందని ప్రముఖ సర్వే సంస్థ డీఎన్ఏ వెల్లడించింది. విపక్ష సమాజ్ వాదీ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది.. సమాజ్ వాదీ పార్టీ నుంచి నలుగురు, భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు, రాష్ట్రీయ లోక్ దళ్ , ఆర్ఎల్డీ, నిషాద్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 అసెంబ్లీ స్థానాలకు ఖాస్ళీ ఏర్పడింది. ఫలితంగా ఆస్థానాలలో ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించింది. ఈ ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గెలుస్తుందని, సమాజ్ వాదీ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
వినూత్న ప్రచారం..
ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ప్రచారం చేసింది. ఓ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడు పార్టీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. అయితే ఆ విందులో మటన్ ముక్కలు సరిగ్గా వేయకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. క్యాటరింగ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. బిజెపి నాయకులపై విమర్శలు చేశారు..” ఎన్నికల సమయంలో కార్యకర్తలను వాడుకుంటారు. కానీ వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టరు. ఇలాంటి వ్యక్తులకు ఓట్లు ఎందుకు వేయాలి? ఇలాంటి వ్యక్తులకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ఇందుకోసమేనా కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు మోసేది” అంటూ ధ్వజమెత్తారు. అయితే అఖిలేష్ యాదవ్ ఇలా ప్రచారం చేసినప్పటికీ అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తున్నదని తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర్ ప్రదేశ్లో భారీగా సీట్లు కోల్పోయింది. ఇండియా కూటమి ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దీంతో ముఖ్యమంత్రి యోగి పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన రంగంలోకి దిగారు. పార్టీలోని చీలికలను రూపుమాపారు. నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Up by elections each party claiming how many seats they will win
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com