Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Water Message: జలం జీవం జీవితం.. చంద్రబాబు చెప్పిన గొప్ప నీటి సందేశం..

Chandrababu Water Message: జలం జీవం జీవితం.. చంద్రబాబు చెప్పిన గొప్ప నీటి సందేశం..

Chandrababu Water Message: ఈ భూమి మీద పీల్చేగాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ భూభాగంలో సింహభాగం నీరు ఉన్నప్పటికీ.. అందులో తాగడానికి పనికి వచ్చేది కొంత మాత్రమే. అందువల్లే తాగునీటిని జాగ్రత్తగా వాడాలి. తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా రక్షించుకోవాలి. నీరు లేకపోతే ఈ భూమ్మీద జీవికి మనుగడలేదు. అందువల్లే నీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని వినియోగించుకునే విషయంలో కూడా ముందుచూపును ప్రదర్శించాలి. నీటి వనరులను ఇష్టానుసారంగా […]

Chandrababu Water Message: ఈ భూమి మీద పీల్చేగాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ భూభాగంలో సింహభాగం నీరు ఉన్నప్పటికీ.. అందులో తాగడానికి పనికి వచ్చేది కొంత మాత్రమే. అందువల్లే తాగునీటిని జాగ్రత్తగా వాడాలి. తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా రక్షించుకోవాలి.

నీరు లేకపోతే ఈ భూమ్మీద జీవికి మనుగడలేదు. అందువల్లే నీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని వినియోగించుకునే విషయంలో కూడా ముందుచూపును ప్రదర్శించాలి. నీటి వనరులను ఇష్టానుసారంగా వాడితే.. భూగర్భంలో ఉన్న జలాలను విపరీతంగా ఉపయోగిస్తే ఆ ప్రభావం భవిష్యత్ తరాల మీద తీవ్రంగా ఉంటుంది. అందువల్లే నీటి సంరక్షణ విషయంలో ముందు చూపుతో ఉండాలి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నూటికి నూరు కాదు.. అంతకుమించి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వనరుల సంరక్షణలో ముందడుగు వేసింది చంద్రబాబు నాయుడే. గతంలో నీరు మీరు అనే కార్యక్రమాన్ని చేపట్టి.. చెరువులో పూడికతీతలు.. గొలుసుకట్టు చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టి.. వ్యవసాయానికి అనుసంధానం చేశారు.

ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులను ఆయన పూర్తి చేస్తున్నారు. ఆ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాలపాటు కొనసాగుతూ వస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి.. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరును.. తాగునీరును అందించారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించారు. ప్రాజెక్టు కాల్వలో దండిగా నీరు వెళ్తున్న నేపథ్యంలో.. అదే ప్రాంతంలో ఉన్న కొన్ని వానరాలు ఆ కాలువ లో ఉన్న నీటిని తాగాయి. ఈ వీడియో చంద్రబాబు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. అంతేకాదు జలం జీవం జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జనం లేకపోతే జీవం లేదని.. జీవం లేకపోతే జీవితమే లేదని చంద్రబాబు జీవిత సత్యాన్ని బోధించారు. తాగునీటిని సక్రమంగా వాడుకోకపోతే.. నీటి వనరులను సంరక్షించుకోకపోతే ఏ స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఈ వీడియో ద్వారా చంద్రబాబు ప్రజలకు తెలియజేశారు.

వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టారు. ఇక్కడ కూడా ఆయన రాజకీయాలను చూసుకోలేదు. కేవలం ప్రకాశం జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని అందించిన మంచి పేరు తనకు ఉంటే సరిపోతుందని భావించారు. అయితే ఈ ప్రాజెక్టును కేవలం పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం కాకుండా.. ప్రజల కోసం.. ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రారంభించారు. తద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా కృష్ణానది నీరు ప్రవహిస్తోంది. పాలకుడు గట్టిగా ఉంటే ప్రజలకు భరోసా ఉంటుంది. అ భరోసా ఎన్ని తరాల కైనా సరే అలాగే నిలబడుతుంది. అచ్చం చంద్రబాబు లాగా..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper