Irumudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. అందులో రవితేజ ఒకరు…సోలో హీరోగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రవితేజ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ వరుస సక్సెస్ సాధించకపోయిన కూడా అడపదడప విజయాలతో తన కెరియర్ ను ముందుకు నెట్టుకు వస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన ‘ఇరుముడి’ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ప్రేక్షకులందరి సినిమాను చూడడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? నెగిటివ్స్ ఏంటి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
రవితేజ యాక్టింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో రివిల్ అయ్యే ట్విస్టులు కూడా ఈ సినిమాలో హైలెట్ అయ్యాయి. మల్లెపూల పల్లకి అందాల పల్లకి అనే సాంగ్ కూడా ఈ సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది. ఇక దానికి తగ్గట్టుగానే స్క్రీన్ మీద పాటలు చూస్తున్నంత సేపు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి…
నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు వాటిని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. అసలు పోలీసు వాళ్ళు అనేవారు ఎవరు ఈ సినిమాలో కనిపించరు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఉండదు.
ఎందుకని అలా జరుగుతున్నాయి అని దానిమీద ఎవరికి ఎలాంటి ఫోకస్ ఉండదు… ఇక ప్లస్ లు, మైనస్ లను పక్కన పెడితే ఈ సినిమా ఓవరాల్ గా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఇక రవితేజ నుంచి చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సినిమా రావడంతో ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…