Irumudi: రవితేజ లాంటి హీరో నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరోసారి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాని దర్శకుడు శివ నిర్వాణ రవితేజ కంటే ముందు వేరొక హీరో కైతే వినిపించారట. ఆ హీరో ఈ కథను విని బాగుందని చెప్పినప్పటికీ ఆ తర్వాత తనకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదని చెప్పారట. ఇంతకీ ఈ కథను విని రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే నాగార్జునగా తెలుస్తుంది. మొదట శివ నిర్వాణ ఈ కథను నాగార్జున దగ్గరికి తీసుకెళ్లడట. నాగార్జున కథ బావుంది అని చెప్పాడు కానీ అతనికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమానైతే చేయలేకపోయారట. ఇక ఏది ఏమైనా కూడా రవితేజకి ఈ సినిమాతో ఒక మంచి కంబ్యాక్ అయితే దొరికిందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమా శివ నిర్వాణ కి కూడా ఒక మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి.
ఇంతకుముందు ఆయన చేసిన టక్ జగదీష్, ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంతకు ముందు చేసిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కాబట్టి టక్ జగదీష్, ఖుషీ ఫ్లాప్ లతో ఆయన డీలా పడిపోయినప్పటికి ఈ సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడనే చెప్పాలి…
ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ, శివ నిర్వాణ ఇద్దరు తమ తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి రవితేజ హసిత్ గోలీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీవిష్ణు కూడా ఒక హీరోగా నటిస్తుండటం విశేషం…
ఇక శివ నిర్వాణ తన తదుపరి సినిమాని నాగచైతన్య తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంతకుముందు మజిలీ మూవీ చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించారు. కాబట్టి మరోసారి ఇదే కాంబోలో సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…