పోర్న్ వీడియోల చిత్రీకరణ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అతన్ని అరెస్టు చేసిన తరువాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చేవారిని వెబ్ సిరీస్ లలో అవకాశాలిప్పిస్తానని చెప్పి, వారితో ఫోర్న్ వీడియోలు చిత్రీకరించేవాడనే సంచలన ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో.. ఈ విషయం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పటి వరకూ ఈ విషయంలో శిల్పాశెట్టి స్పందించలేదు. తాజాగా.. సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు.
రాజ్ కుంద్రా వ్యవహారం బయటపడడంతో.. శిల్పాశెట్టి దేశం విడిచిపోతారనే వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెట్టిన శిల్పాశెట్టి.. ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ప్రఖ్యాత రచయిత జేమ్స్ థర్బర్ మాటలను కోట్ చేస్తూ.. తన ఫీలింగ్స్ ను పరోక్షంగా బయటపెట్టారు. ‘‘ఆవేశంతో గతాన్ని, భయంతో భవిష్యత్ ను చూసుకోవద్దు. కానీ.. నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో’’అంటూ.. తన పరిస్థితిని ఎమోషనల్ గా రివీల్ చేశారు శిల్పా.
‘లుకింగ్ ఎరౌండ్’ అనే టైటిల్ గల పుస్తకంలోని ఒక పేజీని స్క్రీన్ షాట్ తీసి పోస్టు చేశారు. ‘‘వ్యతిరేక పరిస్థితుల వల్ల మనం కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారిని చూస్తే.. అనవసరమైన ఆందోళనకు గురవుతాం. ఆ పరిస్థితుల వల్ల ఏర్పడే భయాందోళనల వల్ల మన పని స్తంభించిపోతుంది. లేదంటే.. రోగాల బారిన పడతాం. చివరకు ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని భావోద్వేగాన్ని బయటపెట్టారు.
‘‘నేను ఇంకా సజీవంగా ఉన్నానని భావించడానికి దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. గతంలో ఎన్నో సవాళ్లు అధిగమించాను. భవిష్యత్ లోనూ అధిగమించి, మనుగడతోనే ఉంటాను’’ అంటూ శిల్పాశెట్టి స్పందించడం గమనార్హం. మొత్తానికి భర్త రాజ్ కుంద్రా కేసు విషయంలో శిల్పాశెట్టి తీవ్ర ఆవేదనలో ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. అదే సమయంలో.. దాన్నుంచి బయటపెడేందుకు తనకు తానే ఓ మోటివేటర్ మారిన విషయం కూడా ఈ పోస్టుల ద్వారా తెలుస్తోంది. మరి, ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? రాజ్ కుంద్రా ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Shilpa shetty opened emotionally about her husband rajkundra porn videos case for the fist time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com