Star Actress: మనం ఏదైనా కొత్తగా సాధించాలి అనుకున్నప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్లకంటే వెనక్కి లాగే వారే చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరిని దాటుకొని ముందుకు రావడం కొంతవరకు కష్టమైన పనే అయినప్పటికీ మన లక్ష్యం మన కళ్లెదురుగా కనిపించినప్పుడు వాళ్ళని వదిలించుకొని ముందుకు సాగడం పెద్ద కష్టమైతే కాదు. ఇక ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి.
ఏదైనా గొప్ప గా సాధించాలి అంటే మన దగ్గర ఉన్న కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం ముందుగానే గ్రహిస్తే మంచిది. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. మనకి ఆర్థికంగా గాని, మానసికంగా గాని చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా ఓటములు ఎదురవుతూ ఉంటాయి. దెబ్బలు,ఎదురు దెబ్బలు కూడా తగులుతూనే ఉంటాయి. వాటిని ఓర్చుకొని ముందుకు సాగినప్పుడే మనం సక్సెస్ అవుతూ ఉంటాం…
ఇక బాలీవుడ్ హీరోయిన్ అయినా శిల్పా శెట్టి ని కూడా మొదట్లో చాలామంది హేళన చేస్తూ మాటలు మాట్లాడేవారట. ఆమె మొదట్లో చాలా సన్నగా ఉండేవారట. దాంతో ఆమెను డీ గ్రేడ్ చేస్తూ ఉండేవారట. అయినప్పటికీ తను పట్టువదలకుండా సినిమాల్లో రాణించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగడం వల్ల ఆమె కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది…ఇక శిల్పా శెట్టి తన వ్యక్తిగత విషయాలను హ్యూమన్స్ ఆఫ్ బాంబే తో షేర్ చేసుకుంది…
ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ నా చదువు అయిపోయిన తర్వాత మా నాన్నతో పాటు పనిచేయాలనుకున్నాను. కానీ అనుకోని కారణాలవల్ల ఒక ఫ్యాషన్ షో లో పాల్గొనాల్సి వచ్చింది. ఇక అందులో ఫోటోగ్రాఫర్ నా ఫోటోలు తీసి నన్ను చాలా అందంగా చూపించడంతో నేను గ్లామర్ ఫీల్డ్ కి పరిచయం అవ్వాల్సి వచ్చింది. ఇక నేను మొదటి సినిమా చేసినప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు అప్పుడు నేను చాలా సన్నగా, కొంచెం నల్లగా ఉండేదాన్ని ఇక కొంతమంది హేళన చేసిన భరిస్తూ వచ్చాను. ఇక నేను సినిమాలు చేస్తున్న మొదట్లో నాకు హిందీ సరిగ్గా వచ్చేది కాదు, ఎవరైనా మాట్లాడితే అర్థం అయ్యేది కూడా కాదు.దాని వల్ల చాలా ఇబ్బందిని ఎదుర్కొన్న.. ఇక కెమెరా ముందు నేను ఉన్నప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాను. ఈ క్షణమే నా చివరి క్షణమేమో అనుకుంటూ భయంతో వణికిపోతూ ఉంటాను. అయినప్పటికీ సీన్ ఎక్కడ మిస్ అవ్వకుండా నటించి మెప్పిస్తూ ఉంటాను…
ఇక ‘బిగ్ బ్రదర్ షో ‘లో పాల్గొన్నప్పుడు ఇతర కంటెస్టెంట్స్ అందరూ ఒకటై పోయి నా పైన కొంతవరకు పక్షపాతం అయితే చూపించారు. ఇక అప్పుడు నేను ఒంటరిని అయిపోయాను అనుకున్నాను. కానీ నేను చాలా ప్రయత్నం చేసి ఈ స్టేజ్ కి చేరుకున్నాను. ఇప్పుడు వెను తిరిగి వెళ్ళిపోతే ఎలా అనే ఉద్దేశ్యం తోనే గెలవాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఆడాను మొత్తానికైతే విన్నర్ అయ్యాను. ఇక నేను గెలిచిన తర్వాత చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు అని తను సక్సెస్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో తెలియజేసింది. ఇక ఇది ఇలా ఉంటే ఆమె రాజ్ కుంద్రా ను మ్యారేజ్ చేసుకుంది. వాళ్లకు వియన్, షమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇప్పుడు తను నటిగా, తల్లిగా, భార్యగా పలు రకాల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మిగిలిన వాళ్ళు తనని ఇన్స్పిరేషన్ గా తీసుకునే రేంజ్ కి ఎదిగారు. ఇక వీళ్లకు వందల కోట్లు ఖరీదు చేసే ఇల్లు ఉంది. అలాగే ఈమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉండటం విశేషం…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More