Shilpa Shetty Family Controversies: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈమధ్య కాలం లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి చాలా ఏళ్ళ నుండి ‘బాస్టియన్ బాంద్రా’ అనే రెస్టారెంట్ ని నడుపుతూ ఉంది. కానీ రీసెంట్ గానే ఈ రెస్టారెంట్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. ఒక లోన్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం లో 2015 నుండి 2023 మధ్య జరిగిన కుట్రకు 60 కోట్ల రూపాయిల లూటీ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శిల్పా శెట్టి ఎంతో ఇష్టంతో నడుపుతూ వచ్చిన ఈ రెస్టారెంట్ ని మూసివేస్తున్నట్టు నిన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఎందుకు మూసి వేయాల్సి వచ్చింది అనే దానికి ఎలాంటి కారణాలు ఈమె చెప్పలేదు కానీ ఆమె తన రెస్టారెంట్ కి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకుంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసింది.
Also Read: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్..వీడియో వైరల్!
అందులో ఏముందంటే ‘ఈ గురువారంతో మేము బాస్టిన్ బాంద్రా రెస్టారెంట్ కి ఫేర్ వెల్ చెప్తున్నాము. ఇదే మా చివరి వర్కింగ్ డే. ఈ రెస్టారెంట్ తో మాకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఎన్నో మర్చిపోలేని రాత్రులు, మరెన్నో తీపి జ్ఞాపకాలకు నిలయమైన ఈ రెస్టారంట్ ని ఆపేందుకు కాస్త కష్టమే అయ్యినప్పటికీ, ఆపేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నా సన్నిహితులకు ఒక ఫేర్ వెల్ పార్టీ ని ఇస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి.
2016 వ సంవత్సరంలో శిల్పా శెట్టి ఈ రెస్టారెంట్ ని బాంద్రా లో మొదలు పెట్టింది. ఇందులో దొరికే ఫుడ్ కి , ఇతర ఐటమ్స్ కి కస్టమర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాంద్రా లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ రెస్టారెంట్ ఇప్పుడు మూత పడుతుంది అనే వార్త తెలియగానే కస్టమర్స్ చాలా బాధ పడ్డారు.
– దంపతులపై మోసం కేసు (రూ. 60 కోట్లు):
ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారంటూ ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి ఫిర్యాదు చేశారు. వారి కంపెనీ ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ కోసం అప్పు లేదా పెట్టుబడి రూపంలో ఈ డబ్బు తీసుకున్నారని, అయితే ఆ డబ్బును వ్యాపార అవసరాలకు కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడారని కోఠారి ఆరోపించారు. దీనిపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. అయితే, కుంద్రా మరియు శిల్పా శెట్టి తరఫు న్యాయవాది ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ఇది పూర్తిగా సివిల్ వివాదమని తెలిపారు. అయితే ఈ దంపతులకు చెందిన అడ్వకెట్ మాత్రం ఇది సమయాన్ని వృధా చేసే కేసు అని తన వాదనను వినిపించాడు.
– రాజ్ కుంద్రాపై కేసుల పరంపర
శిల్పా శెట్టి భర్త పై ఈ ఒక్క కేసు మాత్రమే కాదు. గతంలో ఆయన పై చాలా కేసులు నమోదు అయ్యాయి. గతంలో ఆయన పై పోర్నోగ్రఫీ రాకెట్ కేసు కూడా ఫైల్ అయ్యింది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బెయిల్ పై కేసు ఎదుర్కొంటున్నారు.
* పోర్నోగ్రఫీ కేసు:
2021లో, పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను ఉత్పత్తి చేసి మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా ప్రచురించిన ఆరోపణలపై రాజ్ కుంద్రా అరెస్టయ్యారు. ‘హాట్‌షాట్స్’ వంటి యాప్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, చందాదారుల నుండి డబ్బు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన 63 రోజులు జైలులో ఉన్నారు.కుంద్రా ఈ ఆరోపణలను ఖండించారు. తనను అన్యాయంగా ఇరికించారని, తాను ఈ కంటెంట్‌ను రూపొందించడంలో క్రియాశీలంగా పాల్గొనలేదని చెప్పారు.
* మనీలాండరింగ్, బిట్‌కాయిన్ కుంభకోణం:
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రాజ్ కుంద్రపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేస్తోంది. ఒక బిట్‌కాయిన్ పోంజీ కుంభకోణంలో కుంద్రాకు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో రూ. 97 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ED జప్తు చేసింది.
తనపై తప్పుడు కేసులతో కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని గతం లో రాజ్ కుంద్రా ధర్నా కూడా చేపట్టాడు. ఇలా కేవలం ఈయనపైనే ఎందుకు ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిప్పు లేనిదే పొగ రాదనీ పెద్దలు అంటుంటారు, కాబట్టి ఈ వ్యవహారాల్లో రాజ్ కుంద్రా పాత్ర ఎంతైనా ఉండి ఉండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.