Shilpa Shetty Family: వాళ్ళకు డబ్బుకు కొదవ లేదు. పేరు ప్రఖ్యాతులకు లోటు లేదు. అన్ని ఉన్నప్పటికీ.. వారి బుద్ధి గడ్డి తిన్నది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కింది.. అంతేకాదు అడ్డమైన పనులు కూడా చేయించింది. అయితే రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా. వారి వ్యవహారం బయట పడింది. చివరికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసే దాకా వెళ్ళింది.
హిందీ చిత్ర పరిశ్రమలో శిల్పా శెట్టి గురించి తెలియని వారు ఉండరు. ఆమె రాజ్ కుంద్రా అనే వ్యాపారిని పెళ్లి చేసుకున్న తర్వాత శిల్ప స్థాయి మరింత పెరిగింది. సినిమాల్లో అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలకు జడ్జి గా వ్యవహరిస్తూ శిల్ప భారీగానే సంపాదిస్తోంది. మరో వైపు రాజ్ కుంద్రా కూడా వ్యాపారాలు చేస్తూ దండిగానే వెనకేసుకుంటున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ డబ్బు సంపాదన కోసం ఈ ఇద్దరు దంపతులు అడ్డమైన వ్యవహారాలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజ్ అశ్లీల వీడియోలు తీసి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. మొదట్లో ఈ దందా బాగానే సాగినప్పటికీ ఆ తర్వాతే పోలీసులకు తెలియడంతో కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులపాటు రాజ్ జైలు జీవితం కూడా గడిపాడు. ఇటీవల బయటికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ దంపతులకు సంబంధించిన ఓ కీలకమైన విషయం బయటికి వచ్చింది. అది కాస్త లుక్ అవుట్ నోటీస్ కు జారీ చేసింది.
వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి
శిల్పా శెట్టి దంపతులు వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబై నగరానికి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి నుంచి 50+ కోట్ల వరకు తీసుకున్నారు. వ్యాపారాన్ని విస్తరించకపోగా.. డబ్బులు అడిగితే బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగం రంగంలోకి దిగింది. శిల్ప దంపతులపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అంతేకాదు వీరిద్దరి ట్రావెల్ లాగ్ లను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శిల్ప దంపతులకు ఈ తరహా కేసులు కొత్త కాకపోయినప్పటికీ.. ఇంతవరకు లుక్ అవుట్ నోటీసులు జారీ కాలేదు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతుంది.
View this post on Instagram