
ఈసారి ఒలింపిక్స్ లో మెడల్ ఖాయమనుకున్న గేమ్స్ లో ఆర్చరీ ఒకటి. కానీ తొలి రోజే అర్హత రౌండ్లలో మన ఆర్చర్లు నిరాశపరిచారు. మహిళల సింగిల్స్ లో దీపికా కుమారి 9వ ర్యాంక్ తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్ లో అయితే మన వాళ్లు ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్ లో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాడు. ఇండియా తరఫున అతడిదే బెస్ట్ ర్యాంక్. ఇక అతాను దాస్ అయితే 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ప్రవీణ్ కంటే రెండు ఎక్కువ కొట్టాడు. అతాను మొత్తం 24, 10 లు సాధించాడు. మరో ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్ 37వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.