Amaravati Capital City: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. 2019 నుంచి 2024 వరకు అమరావతిలో తుమ్మ చెట్లు మాలిచాయి. నిర్మించిన భవనాలు పడావు పడ్డాయి. ఈ నేపథ్యంలో 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు అమరావతి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా ఆయన నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో మరో కలికితురాయి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు మరో 15 వేల కోట్లు లభించాయి. ఈ ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంక్.. ప్రపంచ బ్యాంకు సానుకూలత వ్యక్తం చేశాయి. క్యాపిటల్ సిటీ ఏరియాలో జరుగుతున్న పనుల పురోగతి.. ఇతర అంశాల కల్పన. లేబర్ వెల్పేర్ వంటి అంశాలపై ఇటీవల డబ్ల్యూ బీ, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. వారంతా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు… ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశంసించారు.
అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం 52 వేల 362 కోట్ల అంచనా వేయంతో 102 కీలక పనులు చేస్తున్నారు.. వీటిలో రాష్ట్ర శాసనసభ.. హైకోర్టు.. సచివాలయం.. హెచ్ఓడి టవర్లు.. వరద నివారణకు చేపట్టే చర్యలు.. ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ల్యాండ్ పోలింగ్ ప్రాంతాలలో వసతుల కల్పన వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పనుల పురోగతిని పరిశీలించేందుకు వరల్డ్ బ్యాంకు, అసియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ప్రతినిధులు గత నెలలో మూడు రోజులపాటు క్యాపిటల్ సిటీ ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ సిఆర్డిఏ అధికారులతో సమీక్షలను నిర్వహించారు. అభివృద్ధి పనులకు అవసరమైన అదనపునిధులపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు అదనంగా మరో 15 వేల కోట్ల రుణం కోసం ఏపీ సి ఆర్ డి ఏ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నిధులు సమకూరితే రాజధాని నిర్మాణ పనులకు మరింత ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది.
అమరావతి పర్యావరణహిత.. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడం.. ప్రస్తుత ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశంగా ఉంది. రోడ్ల నిర్మాణం. వాటర్ సప్లయి.. సినరేజ్ వాటర్ మెంటనేన్స్ ఫ్లడ్ వాటర్ కంట్రోల్.. ప్రజా రవాణా.. ఇతర పనుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు.. ఏడిబి సహకారం అందిస్తున్నాయి. అదనపునిధుల ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఆర్థిక వనరులు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టుల పురోగతి.. నిధుల వినియోగం.. నిర్మాణాల పూర్తికి సంబంధించిన గడువులపై.. త్వరలోనే అధికారికంగా ప్రకటనలు వెలుపడే అవకాశం ఉంది.