Homeఎంటర్టైన్మెంట్Top Director Telugu Cinema: ఆ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్న టాప్ డైరెక్టర్...

Top Director Telugu Cinema: ఆ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్న టాప్ డైరెక్టర్…

Top Director Telugu Cinema: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులందరు మనవాళ్లే కావడం విశేషం… ఇక హీరోలైతే వరుస విజయాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం చెమటలు పట్టించే విధంగా మనవాళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన రాని […]

Top Director Telugu Cinema: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులందరు మనవాళ్లే కావడం విశేషం… ఇక హీరోలైతే వరుస విజయాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం చెమటలు పట్టించే విధంగా మనవాళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన రాని గుర్తింపు మనవాళ్లు చేస్తున్న వరుస సినిమాలతో తెచ్చుకొంటున్నారు… రాజమౌళి లాంటి దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ముగ్గురు హీరోలతో మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది… ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం… మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లను పెట్టి ఆయన ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి కథను కూడా రెడీ చేస్తున్నారట.

ప్రస్తుతానికి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న ఆయన తొందరలోనే ఈ సినిమాకి ముహూర్తం పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా స్పిరిట్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ గుర్తింపును సంపాదించుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది…ఇక ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న మన హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే కథలు బాగుండాలి.

ఇక ఇంతకుముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది కాబట్టి ఇప్పుడు అందరు మల్టీ స్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు…ఇక సందీప్ రెడ్డి వంగ మాత్రం ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ముగ్గురు హీరోలను చూపించి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా వీలైనంత తొందరగా పట్టాలెక్కితే మంచిదని ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చాలామంది కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper