Sampoornesh babu: హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమై.. బర్నింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో సంపూర్ణేశ్ బాబు. ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే.. దేశంలో ఎటువంటి నేరాలు జరగవని.. ఓ మగాడి శీలం పోతే.. దాని కోసం చేసే పోరాటమే ఈ క్యాలీ ఫ్లవర కథ అని తెలిపారు సంపూర్ణేశ్. నా సినిమాలంటే.. హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 సినిమాలే అందరికీ గుర్తొస్తాయని.. ఇప్పుడు రాబోతున్న క్లాలీ ఫ్లవర్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందని అన్నారు సంపూ. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చి దైరెక్టర్ రాధాకృష్ణ..
మిమ్మల్ని నవ్వించేేందుకు చేసిన ప్రయత్నమే ఈ క్యాలీ ఫ్లవర్ అంటూ పేర్కొన్నారు. కరోనా సమయంలో అన్ని నిబంధనలు పాటిస్తూ.. ఎటువంటి ఆటంకం రాకుండా సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. 20 రోజుల పాటు వరుసగా షూట్ జరిగినందని.. షూటింగ్ చేయడం ఓ ఎత్తైతే.. అందరికీ పని కల్పించడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఈ సినిమా హిట్ అయితే అది ప్రేక్షకులదే అని.. తేడా వస్తే తన నటన లోపం వల్లేనని మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని అన్నారు సంపూ.