Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ నమ్మకం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అనవసరంగా పోటీలోకి వచ్చి వచ్చే లాభాలను ఎందుకు పోగొట్టుకోవడం ? అలాగే మిగిలిన సినిమాలకు ఎందుకు కొంతమేరకు అయినా వచ్చే లాభాలను అడ్డుకోవడం ? అసలుకే ఓ వైపు ‘ఆర్.ఆర్.ఆర్’ రేసులో ఉంది. ఈ సినిమాకు కనీసం రెండు వారాల గ్యాప్ కావాలి. కానీ, ఆ గ్యాప్ కి అవకాశం లేకుండా ‘రాధే శ్యామ్’ నేను కూడా సై అంటూ సంక్రాంతి రేసులోకి వచ్చి బలంగా నిలబడ్డాడు.

కానీ, యువీ వాళ్ళ మీద ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే.. ‘రాధే శ్యామ్’ విషయంలో ఇప్పటివరకు వాళ్ళు చెప్పింది ఏదీ చేయలేదు. ఈ లెక్కన రిలీజ్ డేట్ కి తమ సినిమాను రిలీజ్ చేయకపోవచ్చు. ఎప్పటిలాగే సింపుల్ గా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయిందని ఒక పోస్టర్ పెట్టొచ్చు. కాకపోతే, రిలీజ్ అయితేనే ఇక్కడ ఇబ్బంది. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ పై కొంచెం అయినా ప్రభాస్ సినిమా ప్రభావం చూపెడుతుంది.
కాబట్టి.. ఈ సంక్రాంతికి రెండు కొదమ సింహాలు లాంటి భారీ చిత్రాలు బలంగా పోటీ పడుతున్నాయి. ఇలాంటి పోటీ మధ్యకు వెళ్లి కావాలని ఇరుక్కోవడం ఎంత మాత్రం తెలివి అనిపించుకోదు. అందుకే మహేష్ బాబు కూడా తన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ ను సైలెంట్ గా పోస్ట్ ఫోన్ చేసుకుని రేసు నుంచి తపుకున్నాడు. ఏప్రిల్ కి షిఫ్ట్ అయిపోయాడు.
కానీ, భీమ్లా నాయక్ మాత్రం పోస్ట్ ఫోన్ కావడానికి ఆసక్తి చూపించలేదు. మొదట భీమ్లా నాయక్ కూడా వాయిదా బాట పడతాడులే అనుకున్నారు. కానీ, వెనక్కి తగ్గడం తన హిస్టరీలో లేదన్నట్టు.. భీమ్లా నాయక్ రెచ్చిపోయి మరీ రేసులోకి వచ్చి నిలబడ్డాడు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి ముక్కోణపు పోటీ బలంగా కనబడుతుంది.
అయితే, దర్శక నిర్మాతలు ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నారు ? అదే భీమ్లా నాయక్ కి సోలో రిలీజ్ డేట్ గాని, దొరికితే సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి. సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ, జనవరి 12నే వస్తున్నట్టు ప్రకటించి.. ఆర్.ఆర్.ఆర్, ‘రాధే శ్యామ్’ సినిమాలకు పోటీ అయ్యారు. అసలు భీమ్లా నాయక్ పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ?
Also Read: Suriya: సూర్యకే తమ సపోర్ట్.. పోటీ పడుతున్న సెలబ్రిటీలు !
నిజానికి సంక్రాంతి భారీ సినిమాలు రావడం కొత్తేం కాదులే కానీ, మరీ ఇంతింత పెద్ద పెద్ద సినిమాలు రావడం మాత్రం కాస్త కొత్తే. ఇక వీటన్నిటి మధ్యలో బంగార్రాజు ఒకడు. నేనొస్తా నేనొస్తా అంటూ తెగ ఉబలాట పడుతున్నాడు. మరి చివరికి ఈ పోటీలో ఎవరికీ లాభమో ? ఎవరికీ నష్టమో చూడాలి.
Also Read: Prabhas: ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారమా ?