Anubhavinchu Raja: ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో రాజ్ తరుణ్.. ఆ తర్వాత వరుసగా చిత్రాలు తీస్తూ.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, రాజ్‌తరుణ్ హీరోగా నటించిన సినిమా అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్లో రాజ్‌తరుణ్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. హీరోయిన్ కాశీష్ ఖాన్‌తో రోమాన్స్ కెమిస్ట్రీ, ఫన్ సీన్స్ సినిమాకు ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
సినీ నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్లో కనిపించే ఈ సినిమా ఎంతో కొత్తగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్, రాజ్ తరుణ్‌ల మద్య జరిగే ఫైట్ సన్నివేశాలు, వాటికి తోడు మంచి టైమింగ్‌లో వచ్చే కామెడీ సినిమాను వేరే లెవెల్లో తీసుకెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మరి రాజ్‌తరుణ్ ఈ సినిమాతో హిట్ కొడతాడేమో వేచి చూడాలి. నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్రవర ఎల్ ఎల్ పీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.