Homeఎంటర్టైన్మెంట్Salman Khan: ఆరోగ్య సమస్యలపై క్లారిటీ ఇస్తూ సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్..

Salman Khan: ఆరోగ్య సమస్యలపై క్లారిటీ ఇస్తూ సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్..

Salman Khan: నిన్నటి నుండి సోషల్ మీడియా లో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన లేటెస్ట్ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కందుల వీరుడిగా పిలవబడే సల్మాన్ ఖాన్ , ఇలా పోయారేంటి?, ఆయన ఆరోగ్యం సరిగానే ఉందా?, లేదంటే ఏమైనా తేడా జరిగిందా ?, అసలు భాయ్ కి ఏమైంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు , విశ్లేషకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై […]

Salman Khan: నిన్నటి నుండి సోషల్ మీడియా లో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన లేటెస్ట్ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కందుల వీరుడిగా పిలవబడే సల్మాన్ ఖాన్ , ఇలా పోయారేంటి?, ఆయన ఆరోగ్యం సరిగానే ఉందా?, లేదంటే ఏమైనా తేడా జరిగిందా ?, అసలు భాయ్ కి ఏమైంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు , విశ్లేషకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన కాసేపటి క్రితమే క్లారిటీ ఇస్తూ , ఒక సంచలన ట్వీట్ వేశారు. ‘హాయ్.. మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటూ ఆయన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వేసిన ట్వీట్ సంచలనం గా మారింది. తన పై వచ్చిన రూమర్స్ కి వెటకారంగా సల్మాన్ ఖాన్ వేసిన ఈ ట్వీట్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే వరుసగా రెండు దశాబ్దాల వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలుతూ వచ్చిన సల్మాన్ ఖాన్ , కరోనా లాక్ డౌన్ తర్వాత బాగా డౌన్ అయ్యారు. ఆయన నటించిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఓపెనింగ్స్ లో సల్మాన్ ఖాన్ ని కింగ్ అని పిలిచేవారు , కానీ లాక్ డౌన్ తర్వాత ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దీంతో ఆయన పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కానీ సల్మాన్ ఖాన్ ఎలాంటి సూపర్ స్టార్ అనేది ఎవ్వరూ మర్చిపోకూడదు. సరైన సినిమా పడితే , నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా వేల కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొడుతున్నారు , అలాంటిది సల్మాన్ ఖాన్ తన రేంజ్ కి తగ్గ హిట్ కొడితే ఏ రేంజ్ వసూళ్ల సునామీ క్రియేట్ అవుతుందో మీరే ఊహించుకోండి.

ఇకపోతే ప్రస్తుతం ఆయన అపూర్వ లఖియా దర్శకత్వం లో ‘మాతృ భూమి’ అనే చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటుగా ఆయన మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . వచ్చే ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ కం బ్యాక్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper