Homeఎంటర్టైన్మెంట్The Odyssey 3 Day Collections: 'ది ఒడిస్సీ' 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

The Odyssey 3 Day Collections: ‘ది ఒడిస్సీ’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘అవతార్’ ని అవలీలగా దాటేసిందిగా..

The Odyssey 3 Day Collections: క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’ నార్త్ అమెరికా లో సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే , ఫుల్ రన్ లో కచ్చితంగా అవతార్ రికార్డ్స్ బద్దలు అయ్యేలాగానే కనిపిస్తోంది. మొదటి రోజు , మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నోలన్ కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో […]

The Odyssey 3 Day Collections: క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’ నార్త్ అమెరికా లో సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే , ఫుల్ రన్ లో కచ్చితంగా అవతార్ రికార్డ్స్ బద్దలు అయ్యేలాగానే కనిపిస్తోంది. మొదటి రోజు , మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నోలన్ కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని క్రియేట్ చేసింది. పశ్చిమ దేశాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజులకు కలిపి 56 కోట్ల 66 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. నోలన్ కెరీర్ లోనే ది బెస్ట్ వసూళ్లను ట్రేడ్ పండితులు అంటున్నారు. రోజువారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు 16 కోట్ల 7 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 20 కోట్ల 82 లక్షలు , మూడవ రోజు 19 కోట్ల 77 లక్షల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 68 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , 264 మిలియన్ డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం 1 బిలియన్ మార్కుని అందుకునేలా అనిపిస్తోంది.

నార్త్ అమెరికా నుండి మొదటి మూడు రోజులకు కలిపి 124.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి 139.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నోలన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సినిమాగా నిల్చింది ఈ చిత్రం. కేవలం ఐమాక్స్ వెర్షన్ నుండే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 52 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ గ్రాస్ లో మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా చాలా వరకు ఈ సినిమాకు హెల్ప్ చేసిందనే చెప్పాలి. మార్వెల్ , డీసీ కామిక్ సినిమాలకు తప్ప , మిగిలిన ఇంగ్లీష్ సినిమాలకు మన ఇండియా లో పెద్దగా ఓపెనింగ్ వచ్చిన సందర్భాలు లేవు. జేమ్స్ కెమరూన్ సినిమాలకు ఇండియా లో మంచి గిరాకీ ఉండేది. ఆయన తర్వాత నోలన్ సినిమాలకు మాత్రమే అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper