Bigg Boss: ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒకేసారి అన్ని భాషలకు సంబంధించిన ‘బిగ్ బాస్’ సీజన్స్ మొదలైన సంగతి తెలిసిందే. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున అక్కినేని నాగార్జున తో ఇతర భాషలకు సంబంధించిన హోస్టులు విజయ్ సేతుపతి, మోహన్ లాల్ , సుదీప్ వంటి వారు వీడియో కాల్ లో మాట్లాడుకుంటారు. హిందీ బిగ్ బాస్ సరికొత్త సీజన్ కూడా ఆరోజే మొదలైంది. కానీ ఎందుకో సల్మాన్ ఖాన్ ఈ వీడియో కాల్ లో కనెక్ట్ అవ్వలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో హోస్టులుగా వ్యవహరిస్తున్న అందరికంటే అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హోస్ట్ మరెవరో కాదు, మన అక్కినేని నాగార్జున నే. ఆయనకంటే తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి రెండింతల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం మీకు తెలుసా?. పూర్తి వివరాలను ఎక్సక్లూసివ్ గా మీకోసం ఈ స్టోరీ లో అందిస్తున్నాము చూడండి.
ఈ సరికొత్త సీజన్స్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హోస్ట్ సల్మాన్ ఖాన్. ఈయనకు దాదాపుగా 125 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ హోస్ట్ కూడా తీసుకోలేదని సమాచారం. ఇక ఆ తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హోస్ట్ సుదీప్. దాదాపుగా 100 కోట్ల వరకు ఈయన రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. వాస్తవానికి గత సీజన్ తోనే ఆయన తన బిగ్ బాస్ ప్రయాణం ని ముగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు సుదీప్. కానీ మేకర్స్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం తో కాదు అనలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హోస్ట్ మోహన్ లాల్. ఈయనకు ఈ సీజన్ లో 92 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. మోహన్ లాల్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉండడం తో , హాట్ స్టార్ లో ఇతర భాషలకు సంబంధించిన వ్యూయర్స్ కూడా ఈ షో ని చూస్తున్నారట.
అందుకే ఆయనకు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్. ఇక ఆ తర్వాతి స్థానం లో విజయ్ సేతుపతి ఉన్నాడు. ఈయనకు ఈ సీజన్ కి 80 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నాడట. ఇక 40 కోట్ల రెమ్యూనరేషన్ తో చివరి స్థానం లో ఉన్న ఏకైక హోస్ట్ అక్కినేని నాగార్జున మాత్రమే. స్టాండర్డ్ గా గత 10 సీజన్స్ నుండి ఆయన హోస్ట్ గా కొనసాగుతున్నాడు కాబట్టి , నాగార్జున కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదట. పైగా బిగ్ బాస్ సెట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేశారు కాబట్టి , రెంట్స్ కూడా భారీ రేంజ్ లోనే నాగార్జున కి అందుతున్నాయి.