spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhanush: లక్కీ, ఆన్ లక్కీ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్న ధనుష్...

Dhanush: లక్కీ, ఆన్ లక్కీ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్న ధనుష్…

Dhanush: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ధనుష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలను చేయడానికి సైతం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే సార్, కుబేర లాంటి సినిమాలను చేసిన ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేసి తెలుగు మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అలాగే తమిళ్, తెలుగు రెండు భాషల్లో కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. వైవిధ్యభరితమైన పాత్రలను చేయడంలో ధనుష్ ముందు స్థానంలో ఉంటాడు. ఆయన తర్వాతే ఎవరైనా అనే ఒక స్థాయిలో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఏ దర్శకుడు డిఫరెంట్ క్యారెక్టర్ లను చేయాలని అనుకున్న కూడా ఆ కథలు మొదట ధనుష్ దగ్గరికి వెళ్తుంటాయి. ఆయన అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. ఆయన అయితేనే దర్శకుడు యొక్క విజన్ కి అనుగుణంగా ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి… ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి గొప్ప గౌరవం కూడా అతనికి దక్కుతుంది. ఆయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరిని హీరోయిన్స్ గా తీసుకున్నారు. సాయి పల్లవి లక్కీ హ్యాండ్ గా చెబుతుంటారు.

ఆమె ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం అటు డైరెక్టర్స్ కి ఇటు హీరోలకు బలంగా పాతుకుపోయింది. ఆమె సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకనే ఆమె ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిన కూడా ఆమెను తమ సినిమాలో భాగం చేయాలని చూస్తుంటారు… పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేస్తుంది. అయినప్పటికి ఆమెకు సక్సెస్ మాత్రం రావడం లేదు.

వచ్చిన సినిమా వచ్చినట్టు ఫ్లాప్ అవుతుంది. మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో జత కట్టింది. ఇక దాంతో పాటుగా రాజ్ కుమార్ పెరియాస్వామి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో సైతం ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ధనుష్ ఒకపక్క లక్కీ హ్యాండ్ అయిన సాయి పల్లవి, మరోపక్క అన్ లక్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీ లీలా ఇద్దరితో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. శ్రీలీల సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper