Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో పొలిటికల్ లీడర్ అవతారమెత్తె అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక సహాయంలో భాగంగా ధనుష్ ఇటీవల కొందరు విద్యార్థులకు చెక్కులు అందజేస్తూ కనిపించారు. ఇది మంచి పరిణామమే అయినా ఈ వీడియోపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు సీఎం విజయ్ తో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ధనుష్ ఏం చేశాడు? ఆయనను విజయ్ తో ఎందుకు పోలుస్తున్నారు?
ఎక్స్ పోస్టులో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ధనుష్ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి చెక్కులు అందజేస్తున్నారు. అయితే ఈ చెక్కులు అందుకున్న విద్యార్థులు ధనుష్ కాళ్లకు నమస్కరించారు. ఈ వీడియోలోని దృశ్యాలను కొందరు అభిమానులు సాధారణంగా తీసుకున్నప్పటికీ.. మరికొందరు మాత్రం చిన్న పిల్లలతో ఇలా కాళ్లు మొక్కించుకోవడం సరైన పద్ధతి కాదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ‘విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ సీఎంలు అయిపోతారా? అని కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ధనుష్ తమిళ సాంప్రదాయ దుస్తుల(పంచె)లో కనిపించారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వారందరూ దాదాపు ఈ సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. ఈ విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలస్తోంది. అయితే రాజకీయ ప్రవేశం గురించి ధనుష్ ఎక్కడా ప్రస్తావించలేదు.
విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ధనుష్ చేస్తున్నా.. రాజకీయంగా నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రజలు కోరితే రాజకీయాల్లో రాణించడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఏదీ ఏమైనా ధనుష్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది.
విజయ్ CM అయ్యాడని… అందరూ సీఎంలు అయిపోతారా?
పిల్లల చేత దండాలు పెట్టించుకోవడం… ఈ డ్రామా అంతా దేనికి? పాలిటిక్స్ కూడా కొత్త సినిమా ప్రమోషన్లా మారిపోయింది! #Dhanush #Vijay pic.twitter.com/8GsQW9nLvm
— M9 NEWS (@M9News_) July 27, 2026






