Dhanush viral comments: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో తమిళ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయన ప్రసంగాలు కూడా ఈమధ్యకాలం లో రాజకీయాల్లోకి వస్తాడేమో అని అనిపించేలా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ధనుష్ గతం లో తాను చదువుకున్న థాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాలకు మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా అందించాడు. చెన్నై లోని సాలిగ్రామం లో ఈ పాఠశాల ఉంటుంది. ధనుష్ కట్టించిన ఈ కొత్త భవనానికి ‘ధనుష్ బ్లాక్’ అని నామకరణం చేశారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ధనుష్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈరోజుల్లో పిల్లలకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో వివరించాడు.
ఆయన మాట్లాడుతూ ‘నాదొక రిక్వెస్ట్. ఉదయం 8:30 నిమిషాల నుండి సాయంత్రం 3:30 నిమిషాల మధ్యలో పిల్లలకు శారీరక దృఢత్వం & ధ్యానం పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక పీరియడ్ ని ఏర్పాటు చెయ్యాలి. ప్రస్తుత కాలం లో ఒక మనిషికి ఫిట్నెస్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. పిల్లలకు పెద్దయ్యాక దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన మాతృ భాష తమిళం గురించి మాట్లాడుతూ ‘నేను చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదు. కేవలం తమిళం మాత్రమే స్పష్టంగా వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీ 10 మందిలో 8 మందికి అసలు తమిళం చదవడం , రాయడం రావడం లేదు. ఇది నన్ను చాలా బాధకు గురి చేసే విషయం. నేను బెల్జియం లో ఉన్నప్పుడు ఒక ఫ్రెంచ్ చిత్ర నిర్మాణ సంస్థ కోసం పని చేశాను. వాళ్ళు నన్ను ఇంగ్లీష్ వచ్చా అని అడిగారు’.
‘వచ్చు అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకని అడిగితె మీకు మీ మాతృ భాష తెలిసి ఉండాలి కదా, ఇంగ్లీష్ అనేది కేవలం ఒక అదనపు భాష మాత్రమే అని అన్నాడు. అందుకే మాతృ బాషాని ఎప్పటికీ విస్మరించకూడదు. మీ మాతృబాష పై స్పష్టమైన అవగాహన ఉండాలి. నాకు తమిళం రాదు అని చెప్పుకోవడం గర్వ పడాల్సిన విషయం కాదు, సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం ‘ఓం’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సాయి పల్లవి , శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా , మలయాళం మెగాస్టార్ మమ్మూటీ కీలక పాత్ర పోషిస్తున్నాడు.