Homeఎంటర్టైన్మెంట్The Odyssey : 'ది ఒడిస్సీ' లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద పొరపాటే చేశాడు..

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 270 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే కాదు , మన ఇండియా లో కూడా ఈ చిత్రానికి కళ్ళు […]

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 270 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే కాదు , మన ఇండియా లో కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవుతున్నాయి. వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో కూడా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా అద్భుతమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి 7 కోట్ల 78 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది సాధారణమైన విషయం కాదు.

ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 64 కోట్ల 58 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించిన ప్రతీ నటీనటులకు ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో ఒక కీలక పాత్ర కోసం గతం లో ప్రముఖ హాలీవుడ్ హీరో ధనుష్ ని సంప్రదించారట మేకర్స్. ఆయన్ని ఏ పాత్ర కోసం సంప్రదించారో తెలియదు కానీ, క్రిస్టోఫర్ నోలన్ టీం ‘ది గ్రే మ్యాన్’ చిత్రం లో ధనుష్ నటన ని చూసి , ఒక మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం సంప్రదించారట. కానీ అప్పటికే తెలుగు , తమిళం , హిందీ అని తేడా లేకుండా ధనుష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. దీంతో అయాన్ నోలన్ టీం అడిగినన్ని డేట్స్ కేటాయించలేకపోయారు. ఆ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న సినిమాలో ధనుష్ బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నట్టు అయ్యింది. ఒకవేళ ఈ చిత్రం ఆయన ఒప్పుకొని చేసుంటే , ఆయన రేంజ్ ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper