Homeఎంటర్టైన్మెంట్NTR God of War Movie: 'గాడ్ ఆఫ్ వార్' మూవీ.. ఎన్టీఆర్ సంచలనం...

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కి పోటీగా తమిళం లో వెట్రీ మారన్ సైతం ధనుష్ తో ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. ఇక ఇందులో ఎవరి సినిమా ముందస్తుంది. ఎవరి సినిమా తర్వాత […]

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కి పోటీగా తమిళం లో వెట్రీ మారన్ సైతం ధనుష్ తో ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. ఇక ఇందులో ఎవరి సినిమా ముందస్తుంది. ఎవరి సినిమా తర్వాత రాబోతుంది. ఒక సినిమా వల్ల మరో సినిమాకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అనే ధోరణిలో ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు ధనుష్ అభిమానులు సైతం భావిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఏదో ఒక సినిమా పట్టాలెక్కితేనే దానికి మంచి క్రేజ్ దక్కుతుంది. రెండు ఒకే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించకపోవచ్చు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సైతం ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ వెట్రీ మారన్ తో ఒకసారి మాట్లాడి ఆ సినిమా కథకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఒకవేళ రెండు సేమ్ కథలే అయితే మాత్రం ఎన్టీఆర్ డ్రాప్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ విషయం మీద త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్ వెంటే ఉన్నారట. ఒకవేళ రెండు కథలు సేమ్ అయితే మాత్రం ఈ కథ ప్లేస్ లో మరో కథను తీసుకువచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన కథ లైన్ కూడా ఎన్టీఆర్ కి వినిపించారట.

దాంతో ఎన్టీఆర్ కొంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి తొందరలోనే వెట్రీ మారన్ తో మాట్లాడబోతున్న ఎన్టీఆర్ తన కథ చర్చల విషయంలో ఎలాంటి ఫలితాలు రాబడుతాడు. తద్వారా ‘గాడ్ ఆఫ్ వార్ ‘ సినిమా ఉంటుందా? లేదా అనేది కూడా డిసైడ్ చేయబోతున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper