Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: షాలిని ని ఎలిమినేట్ చేయడానికి రోహిత్ మాస్టర్ ప్లాన్..ఇది మామూలు...

Bigg Boss 10 Telugu: షాలిని ని ఎలిమినేట్ చేయడానికి రోహిత్ మాస్టర్ ప్లాన్..ఇది మామూలు స్ట్రాటజీ కాదు!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టైటిల్ రేస్ కి చాలా దగ్గరగా ఉన్న కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. ‘అగ్ని పరీక్ష 2’ సమయం నుండే ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే హైప్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం , ఆ తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని విపరీతంగా టార్గెట్ చేయడం వంటివి , ఆయన గ్రాఫ్ ని మరో […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టైటిల్ రేస్ కి చాలా దగ్గరగా ఉన్న కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. ‘అగ్ని పరీక్ష 2’ సమయం నుండే ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే హైప్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం , ఆ తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని విపరీతంగా టార్గెట్ చేయడం వంటివి , ఆయన గ్రాఫ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లేలా చేసింది. అయితే రోహిత్ గేమ్ లో ఏకైక నెగెటివ్ ఏదైనా ఉందా అంటే , అది షాలిని మాత్రమే. ‘అగ్ని పరీక్ష 2’ సమయం లో అమన్ తో లవ్ ట్రాక్ నడిపిన షాలిని , బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రోహిత్ తో లవ్ ట్రాక్ నడుపుతూ వస్తోంది. ఎంతలా అంటే రోహిత్ లేకపోతే నేను బ్రతకలేను అనేంతలా ప్రవర్తిస్తుంది.

ముఖ్యంగా అతను అలిగినప్పుడు ఈమె బ్రతిమిలాడే విధానం చూస్తే షాక్ అవ్వక తప్పదు. రెండు రోజుల ముందు రోహిత్ కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణలు చెప్పింది. రోహిత్ వైపు నుండి కూడా షాలిని తో రిలేషన్ విషయం లో చాలా పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. నిన్నటి ఎపిసోడ్ లో షాలిని మేము కేవలం స్నేహితులు మాత్రమే అని వైల్డ్ కార్డ్స్ ముందు కవరింగ్ చేసే ప్రయత్నం చేసింది కానీ , వాళ్ళు మాత్రం నమ్మలేదు. ఇదంతా పక్కన పెడితే రోహిత్ కి ఈ సీజన్ లో వచ్చినన్ని హింట్స్ ఏ సీజన్ లో కూడా మిగిలిన కంటెస్టెంట్స్ కి రాలేదు. హోస్ట్ నాగార్జున నుండి , వైల్డ్ కార్డ్స్ వరకు ప్రతీ ఒక్కరు ఇచ్చిన హింట్ ఏమిటంటే , నీ ఆట చాలా బాగుంది , కానీ నీకు షాలిని నెగెటివ్ అవుతుంది అని.

ఇన్ని హింట్స్ ఇచ్చినా రోహిత్ ఇంకా ఎందుకు షాలిని తోనే ఉన్నాడు?, ఇతనికి బుర్ర పని చెయ్యదా అని ఆయన అభిమానులు బాధపడ్డారు. కానీ రోహిత్ చాలా తెలివైనోడు, హింట్స్ వచ్చాయి కదా అని షాలిని ని దూరం పెడితే ఇన్ని రోజులు ఇతను కంటెంట్ కోసమే షాలిని తో లవ్ ట్రాక్ నడిపాడని జనాలు అనుకుంటారు అనే విషయాన్ని గ్రహించాడు. అందుకే తెలివిగా నామినేషన్స్ లోకి ముకేశ్ ని రప్పించకుండా చేసాడు. ఈ విషయాన్ని షాలిని గ్రహించి రోహిత్ ని నేరుగా అడుగుతుంది. అమన్ ముకేశ్ ని నామినేషన్స్ లోకి లాగుదామని అడిగితే , నువ్వు వద్దు అని చెప్పావు అట నిజమేనా అని షాలిని అడుగుతుంది. అందుకు రోహిత్ సమాధానం చెప్తూ , మన ముగ్గురం (రోహిత్ , షాలిని , అమన్) నామినేషన్స్ లో ఉన్నాము కాబట్టి మన ఓట్లు డివైడ్ అవుతాయి. ఒకవేళ ముకేశ్ , వర్షిణి లలో ఇద్దరు నామినేషన్స్ లోకి వస్తే వాళ్ళ ఓట్లు డివైడ్ అవుతాయి కాబట్టి , నువ్వు సేవ్ అవుతావు. కానీ ముకేశ్ ని అంతకు ముందు ఎవ్వరూ నామినేట్ చేయలేదు , ఒకవేళ అమన్ అతనికి నామినేషన్ వేసినా , కేవలం ఒక్క ఓటు మాత్రమే పరిగణలోకి వస్తుంది , నామినేషన్స్ లోకి రాడు, ముకేశ్ నామినేషన్స్ లోకి రావడం కంటే , వర్షిణి నామినేషన్స్ లోకి వస్తే నువ్వు సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టే నేను వర్షిణి కి నామినేషన్ వెయ్యమని చెప్పాను అని అంటాడు రోహిత్.

కానీ షాలిని లో మాత్రం నమ్మకం రాలేదు, చూసే ఆడియన్స్ కి కూడా ఆమెని ఎలిమినేట్ చేయడానికి రోహిత్ పెద్ద స్కెచ్ వేసాడు అనే అనిపించింది. రోహిత్ వేసిన స్కెచ్ కూడా వర్కౌట్ అయ్యేలాగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వారం త్రిగున్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల వంశీ కి , అదే విధంగా ముకేశ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల వర్షిణి కి ఓటింగ్ భారీ స్థాయిలో పడుతోంది. ఆ కారణం చేత వాళ్లిద్దరూ సేఫ్ అయ్యే అవకాశాలు 90 శాతానికి పైగా ఉండగా , షాలిని సేఫ్ అయ్యే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉంది. షాలిని వల్ల హౌస్ లో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి , ఆమె వల్ల బోలెడంత కంటెంట్ వస్తుంది , ఎలిమినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ టీం బలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప , షాలిని ఎలిమినేట్ కాకుండా ఈ వారం ఎవ్వరూ ఆపలేరని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper