Jailer 2 Review: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్ 2’ చిత్రం పై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ‘జైలర్’ చిత్రం తమిళం తో పాటు తెలుగు లో కూడా సంచలన విజయం సాధించడం వల్లే ఈ సినిమాపై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 41 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది. దానికి తోడు అనిరుద్ అందించిన మ్యూజిక్ కూడా బాగా క్లిక్ అవ్వడం తో , కచ్చితంగా ఈ చిత్రం రజిని కెరీర్ లో మరో సంచలనాత్మక చిత్రం అవుతుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిమిషాలు చాలా స్లో గానే అనిపిస్తాది. కానీ ఆ తర్వాత నుండి నెల్సన్ తన మార్క్ కామెడీ తో, వేరే లెవెల్ హై ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ని ముగిస్తాడు. రెండు యాక్షన్ బ్లాక్స్ వేరే లెవెల్ లో డిజైన్ చేసాడు డైరెక్టర్. ఈమధ్య కాలం లో ఇంతటి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని చూడలేదు అనే ఫీలింగ్ ని రప్పిస్తాది ఫస్ట్ హాఫ్. ముఖ్యంగా టీ స్టాల్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది అనొచ్చు. అదే విధంగా హోటల్ ఎపిసోడ్ కూడా అదిరిపోయింది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ జైలర్ కంటే ‘జైలర్ 2’ 10 రేట్లు బెటర్ అనే ఫీలింగ్ ని రప్పిస్తాది. అనిరుద్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో టైటిల్ కార్డు నుండే తన మార్క్ చూపిస్తూ వచ్చాడు. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మంచి అనుభూతిని అందిస్తుంది ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
ఈమధ్య కాలం లో ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ స్లో గా ఉంటున్నాయి కొన్ని సినిమాలకు. కానీ ఈ సినిమాకు సెకండ్ హాఫ్ కూడా మంచి హై ని ఇచ్చింది అనే చెప్పాలి. ఆరంభం నుండే ఎలివేషన్ సన్నివేశాలతో పాటు, అదిరిపోయే రేంజ్ క్యామియోలు ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్తాయి. ముఖ్యంగా బ్లాక్ అవుట్ ఫిట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ క్యామియో ఈ సినిమాకు పెద్ద హైలైట్ అనే చెప్పాలి. హ్రితిక్ రోషన్ నేను మీ స్టూడెంట్ నే సార్ అంటూ చెప్పే డైలాగ్ కి థియేటర్స్ రూఫ్స్ అదిరిపోయాయి అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈమధ్య కాలం లో తెరకెక్కిన ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. నెల్సన్ మార్క్ కామెడీ + యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని వేరే లెవెల్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 3.5/5.