Moto edge 70 Neo: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మోటరోలా మరో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. అదే Moto edge 70 Neo.. భారీ బ్యాటరీ..హై రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే.. సోనీ కెమెరా సెన్సార్ తో ఈ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ముఖ్యంగా రోజు మొత్తం ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారికోసం 7000 mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Moto edge 70 Neo రిటైల్ బాక్స్ లో ఫోన్ తో పాటు 45 W turbo power చార్జర్..USB Type – C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, యూజర్ గైడ్స్ అందిస్తున్నారు. చార్జర్ ను విడిగా కొనాల్సిన అవసరం లేదు.
డిజైన్ పరంగా మోటరోలా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఫోన్ కు క్వాడ్ కర్వ్డ్ లుక్ ఇచ్చింది. చేతిలో పట్టుకునేందుకు సౌకర్యంగా ఉండేలా అంచులను రూపొందించింది. దీనిమంతం 8.49 మిల్లీమీటర్లు. బరువు 204 గ్రాములు వెనుక భాగంలో ఆకర్షణీయమైన ఫినిషింగ్ ఉంది. నాలుగు రంగుల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫోన్లో 6.8 అంగుళాల Extreme AMOLED display ఉంది. 1.5 K రిజల్యూషన్ తో పాటు 144 హెచ్ జడ్ రీ ప్రెష్ రేట్ అందించారు. 5200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా ఉంది. వీడియోలు చూడడం.. గేమ్స్ ఆడటం.. సోషల్ మీడియా వినియోగం వంటి పనులకు ఈ డిస్ ప్లే ఉపయోగపడుతుంది.
Moto Edge 70 Neo లో క్వాల్ కం స్నాప్ డ్రాగన్ జన్ 3 ప్రాసెసర్ ను ఉపయోగించారు. దీనికి 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 1TB వరకు పెంచుకోవచ్చు.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పై ఈ ఫోన్ పనిచేస్తుంది. మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్స్.. ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని మోటరోలా చెబుతోంది.
ఫోటోగ్రఫీ కోసం వెనకవైపు 50 మెగాపిక్సల్ సోనీ LYTIA 710 మెయిన్ కెమెరా ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్టు కూడా ఉంది. దీనికి తోడు టూ మెగా పిక్సెల్ మైక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాఫిక్సల్ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
ఈ ఫోన్లో 7000 mAh భారీ బ్యాటరీ ఉంది. 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 7.5 W రివర్స్ వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. బైపాస్ చార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. కంపెనీ ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 53 గంటల వరకు బ్యాటరీ పనిచేస్తుంది.
మనదేశంలో Moto edge 70 Neo 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 40,999 రూపాయలుగా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద 3000 తగ్గింపు లభిస్తుంది. అర్హత ఉన్న బ్యాంకు కార్డులపై అదనంగా 3000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.. డిసెంబర్ ఒకటి నుంచి ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్సైట్ .. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ లలో విక్రయాలు మొదలవుతాయి.
మొత్తంగా చూస్తే Moto edge 70 Neo లో అతిపెద్ద బ్యాటరీ.. 144 Hz AMOLED display, 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరా.. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణలు.