Homeఆంధ్రప్రదేశ్‌YS Avinash Reddy: వివేక హత్య కేసు.. ఈడి ప్రశ్నలకు.. బిత్తర పోయిన అవినాష్ రెడ్డి.....

YS Avinash Reddy: వివేక హత్య కేసు.. ఈడి ప్రశ్నలకు.. బిత్తర పోయిన అవినాష్ రెడ్డి.. కన్నీరు మున్నీరు..

YS Avinash Reddy: మాజీ మంత్రి.. వైయస్ జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పాత్ర పై ఈడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక కుట్రధారిగా అవినాష్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈడి అధికారులు బుధవారం దాదాపు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్య కోసం ఖర్చు […]

YS Avinash Reddy: మాజీ మంత్రి.. వైయస్ జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పాత్ర పై ఈడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక కుట్రధారిగా అవినాష్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈడి అధికారులు బుధవారం దాదాపు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్య కోసం ఖర్చు చేయాలి అనుకున్న 40 కోట్ల రూపాయలకు సంబంధించిన మూలాలు.. ఆర్థిక లావాదేవీలతో అవినాష్ రెడ్డికి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఈడి అధికారులు లోతుగా ప్రశ్నించినట్టు.. దర్యాప్తులో కీలక విషయాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులకు ముందస్తుగా చెల్లించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. దీనికి ముందుగా అవినాష్ రెడ్డి మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలాన్ని అధికారులు కడప ఎంపీ ముందు ఉంచారు. ఈ వ్యవహారం వెనుక భారీ ఎత్తున సాగిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడి ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. శివశంకర్ రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డి ద్వారా దస్తగిరి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డికి ముందస్తుగా ఎలా డబ్బులు చేరాయి.. అనే దానిమీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో సాక్షాలు చెప్పిన వ్యక్తులు.. నిధితులు చెప్పిన విషయాలను.. అవినాష్ రెడ్డి చెప్పిన సమాధానాల మధ్య తేడాలను ఈడి అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు సేకరించిన లావాదేవీల ఆధారాలు.. పత్రాలు.. సాక్షుల వాంగ్మూలాలను ఈడి అధికారులు అవినాష్ రెడ్డి ముందు ఉంచారు. అయినప్పటికీ ఆయన పూర్తిస్థాయిలో సహకరించలేదు. దీంతో అవినాష్ రెడ్డిని గురువారం కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం విచారణ పూర్తయిన తర్వాత మీడియా కంటపడకుండా అవినాష్ రెడ్డి వెనుక వైపు మార్గం మీదుగా వెళ్లిపోయారు. సిబిఐ దర్యాప్తు సమయంలో అరెస్టు నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డిని.. ఈసారి మనీ లాండరింగ్ కోణంలో ఈడి అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు వైయస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈడి ఇస్తున్న సంకేతాలు కూడా ఇదేవిధంగా ఉన్నాయి. ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలు.. ఆదాయాలు.. ఇతర వ్యవహారాలపై ఈడి అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అవినాష్ రెడ్డి కుటుంబం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ వ్యవహారంలో వెలుగు చూస్తున్న అంశాలు రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంచలన పరిణామాలకు దారితీస్తాయనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper