Homeబిగ్ స్టోరీస్D Mart Business Strategy:డీ మార్ట్ లో చికెన్ ఎందుకు అమ్మరు.. అసలు బిజినెస్ సీక్రెట్...

D Mart Business Strategy:డీ మార్ట్ లో చికెన్ ఎందుకు అమ్మరు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే..

D Mart Business Strategy: లులూ మాల్ వెళ్లారనుకోండి అక్కడ ఖచ్చితంగా చికెన్ నుంచి మొదలు పెడితే మటన్ వరకు దొరుకుతుంది. చేపలు.. పీతలు.. ఇంకా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ, డీ మార్ట్ లో అలా కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్లామనుకుంటే మనకు రకరకాల వస్తువులు కనిపిస్తాయి. నిత్యావసరాల సరుకుల నుంచి కిరాణా సామగ్రి వరకు.. సబ్బులు.. షాంపూల నుంచి దుస్తుల వరకు ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తక్కువ […]

D Mart Business Strategy: లులూ మాల్ వెళ్లారనుకోండి అక్కడ ఖచ్చితంగా చికెన్ నుంచి మొదలు పెడితే మటన్ వరకు దొరుకుతుంది. చేపలు.. పీతలు.. ఇంకా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ, డీ మార్ట్ లో అలా కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్లామనుకుంటే మనకు రకరకాల వస్తువులు కనిపిస్తాయి. నిత్యావసరాల సరుకుల నుంచి కిరాణా సామగ్రి వరకు.. సబ్బులు.. షాంపూల నుంచి దుస్తుల వరకు ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయని చాలామంది నమ్మకంతో డీ మార్ట్ కు వెళ్తుంటారు.

కానీ మీరు ఎప్పుడైనా గమనించారా డీమార్ట్ లో నాన్ వెజ్ కనిపించదు. చికెన్ మసాలా అమ్ముతారు. మటన్ మసాలా అమ్ముతారు. చేపల మసాలా కూడా అమ్ముతారు. కానీ మటన్.. చికెన్.. ఫిష్ అస్సలు అమ్మరు. అంతేకాదు మిక్సీలు అమ్ముతారు.. ఫ్రిడ్జ్ లు అస్సలు అమ్మరు.

దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది డిమార్ట్ వ్యాపార విధానంలో అత్యంత కీలకమైన అంశం వృధాను పూర్తిగా తగ్గించడం. సూపర్ మార్కెట్లో అమ్ముడుపోని వస్తువులు.. పాడైన ఉత్పత్తులు.. దెబ్బతిన్న ప్యాకెట్ల వల్ల నష్టాలు వస్తూ ఉంటాయి. రిటైల్ వ్యాపారంలో దీనిని శ్రింకేజ్ అని పిలుస్తుంటారు. డీ మార్ట్ లో ప్రతి వంద రూపాయల అమ్మకాల మీద కేవలం 41 పైసల వృధా మాత్రమే ఉంటుంది. చేపలు పంటి త్వరగా పాడగే ఉత్పత్తుల విషయంలో వృధా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చికెన్.. మటన్ విషయంలో కూడా వృధా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇది ప్రతి వంద రూపాయల మీద 8 రూపాయల 76 పైసల వరకు వృధా ఉండే అవకాశం ఉంది.

డీ మార్ట్ వ్యాపార విధానంలో మరో ముఖ్యమైన అంశం ఇన్వెంటరీ టర్నోవర్. అంటే ఒక వస్తువు స్టోర్ కు వచ్చిన తర్వాత ఎంత త్వరగా అమ్ముడుపోతుంది.. ఈ విధానం ద్వారానే డీ మార్ట్ వ్యాపారం సాగిస్తూ ఉంటుంది. డీ మార్ట్ లోకి ఒక వస్తువు వస్తే 33 రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ రోజుల వ్యవధిలోనే అది విక్రయం అవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ఇది వర్తించదు. దీని గడవు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి చికెన్ నుంచి మొదలుపెడితే మటన్ వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎకోకాలం నిలువ ఉంచడానికి అవకాశం ఉండదు. వాటికి ప్రత్యేకమైన శీతలీకరణ వ్యవస్థ అనేది అవసరం. పైగా మన దేశంలో చాలామంది కస్టమర్లు తాజాగా కోసిన మాంసాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఫ్రోజెన్ ప్యాకెట్లకు అంతగా ఆదరణ ఉండదు. అందువల్లే మాంసాహార విభాగాన్ని నిర్వహించడం డీమార్ట్ వ్యాపార విధానానికి పూర్తి వ్యతిరేకం.

ఇక ఫ్రిడ్జ్లు.. వాషింగ్ మిషన్లు వంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో డిమార్ట్ ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. డి మార్ట్ లో ఎక్కువ కల్పించే ఉత్పత్తులు సులభంగా అర్థమయ్యేవి.. ప్రత్యేకంగా విపరీంచాల్సిన అవసరం లేనివి. కస్టమర్లు తమకు కావలసిన వస్తువులు తీసుకొని బిల్లింగ్ కౌంటర్ కు వెళ్లిపోవచ్చు. కానీ ఫ్రిడ్జ్ కొనాలంటే దాన్ని సామర్థ్యం.. విద్యుత్ వినియోగం.. కంప్రెషనర్.. వారంటీ.. ఇతర సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటిని వివరించడానికి ప్రత్యేకంగా సేల్స్ సిబ్బంది అవసరం. ఫ్రిడ్జ్ లాంటి పెద్ద వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఇంటికి తరలించడం.. డెలివరీ చేయడం.. ఇన్స్టాలేషన్ వంటివి అవసరమవుతుంటాయి. ఇటువంటి నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు పెరిగిపోతుంటాయి. అందువల్లే రోజు వారి వస్తువుల మీద మాత్రమే డిమార్ట్ ఫోకస్ పెడుతూ ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ రిటైల్ వ్యాపారంలో పనిచేసే సంస్థల వ్యాపార నమూనా వేరుగా ఉంటుంది. ఉదాహరణకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఫ్రిడ్జ్లు.. వాషింగ్ మిషన్లు.. టీవీలు వంటి వాటిని విక్రయిస్తుంటాయి. వీటిని విక్రయించడానికి ఆ సంస్థకు ప్రత్యేకంగా సేల్స్ సిబ్బంది ఉంటారు. గోదాములు.. డెలివరీ వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువులు సంఘటన 74 రోజుల వరకు నిల్వ ఉండవచ్చని తెలుస్తోంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పెట్టుబడి మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు గోదాములు.. వడ్డీలు వంటి ఖర్చులు పెరిగిపోతుంటాయి.

ఇక డిమార్ట్ విజయానికి ప్రధాన కారణం తక్కువ ధరలకు వస్తువులు విక్రయించడం మాత్రమే కాదు.. సరుకుల కొనుగోలు.. నిల్వ.. నిర్వహణ.. వృధా నియంత్రణ.. వేగంగా సాగే అమ్మకాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి వస్తువును అమ్మాలని కాకుండా.. తమ వ్యాపారానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులను మాత్రమే డిమార్ట్ ఎంచుకుంటుంది. ఈ వ్యూహం ద్వారా అనవసరమైన నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటుంది. అందువల్లే డీమార్ట్ లో చికెన్ కనిపించదు. మటన్ అమ్మరు. చేపలను విక్రయించరు. ఫ్రిడ్జ్ లు కూడా కనిపించవు. ఇవి కేవలం వస్తువులు అమ్మక పోవడం వెనుక ఉన్న కారణాలు మాత్రమే కాదు. ఒక సంస్థ తన వ్యాపారాన్ని ఎలా నిర్వహించుకుంటుందో చెప్పే బలమైన ఉదాహరణలు కూడా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper