Homeఎంటర్టైన్మెంట్ఆరో తేదీ రాత్రి 9 గంటలకు రెడీగా ఉండమంటున్న ఆర్జీవీ

ఆరో తేదీ రాత్రి 9 గంటలకు రెడీగా ఉండమంటున్న ఆర్జీవీ

రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ హిట్స్‌ తీసిన ఆర్జీవీ కొన్నేళ్లుగా వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటూ తనకు తానే సాటి అని నిరూపించుకోవడం ఆయనకే చెల్లింది. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈ మధ్య వరుస సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కుర్రకారుకు […]


రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ హిట్స్‌ తీసిన ఆర్జీవీ కొన్నేళ్లుగా వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటూ తనకు తానే సాటి అని నిరూపించుకోవడం ఆయనకే చెల్లింది. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈ మధ్య వరుస సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కుర్రకారుకు నిద్రలేకుండా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘క్లైమాక్స్‌’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది.

లాక్‌డౌన్‌ సమయంలో టీజర్, ట్రైలర్, పాట విడుదల చేయగా.. అదిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో మియా తన అందాలతో యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఆర్జీవీ ప్రకటించారు. జూన్ ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు తన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఇది ఫ్రీగా చూపించే మూవీ కాదట. ఆర్జీవీ వరల్డ్‌డాట్‌ ఇన్‌, లేదంటే శ్రేయాస్‌ ఈటీ ద్వారా పే ఫర్ వ్యూ మోడల్‌లో రూ. 100 చెల్లించి చూడాలని చెప్పారు. ఆ లోపు మరో ట్రైలర్ను శనివారం రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి, వర్మ పనితనం, మియా మాల్కోవా అందచందాలు చూడాలంటే జూన్ 6 వరకు వెయిట్ చేయాలన్నమాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper