Anil Ravipudi: ఇండస్ట్రీలో ఉన్న అనిల్ రావిపూడి ఒకరు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఎంతసేపు సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. కానీ టైర్ వన్ హీరోలతో మాత్రం సినిమాలు చేసే అవకాశమైతే రావడం లేదు. ఇక మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేసినప్పటికి ఆ సినిమా మహేష్ బాబు రేంజ్ లో లేదు. దానికి తోడుగా మహేష్ బాబు ఆ సినిమా ద్వారా సక్సెస్ ను అందుకున్నప్పటికీ అందులో కొత్తదనమేమీ లేదు. అదే రొటీన్ కామెడీతో సినిమాను నడిపించాడు. దానివల్లే అతనితో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.
సక్సెస్ రావడం కాదు అన్ని క్రాఫ్టుల నుంచి ఆ సినిమా ప్రేక్షకులందరిని 100% ఎంటైర్ టైన్ చేయగలగాలి అపుడే ఆ సినిమా సక్సెస్ ని సాధించినట్టు అని ప్రతి ఒక్క స్టార్ హీరో భావిస్తున్నాడు. కాబట్టే అతనితో సినిమాలు చేయడానికి ఎవరు పెద్దగా ఆసక్తైతే చూపించడం లేదు…
ఇక అందువల్లే అతను సీనియర్ హీరోలతో, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక మీదటైనా ఆయన తన పంథాను మార్చి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్తే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కానీ అనిల్ రావిపూడి మాత్రం తను ఫ్యామిలీ సబ్జెక్టులను డీల్ చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడమే తన బాధ్యతగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక అనిల్ రావిపూడి గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు చేస్తున్న సినిమాలు చాలా మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక మీదట ఆయన టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న సినిమాలను చేయాలి. లేకపోతే ఆయన చాలావరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది…