Homeటాప్ స్టోరీస్Radha Ambika: సొంత సోదరినే దొంగ అని ముద్ర వేసిన నటి రాధ.. అసలు వీరి...

Radha Ambika: సొంత సోదరినే దొంగ అని ముద్ర వేసిన నటి రాధ.. అసలు వీరి మధ్య గొడవ ఏంటి

Radha Ambika: దక్షిణ సినీ పరిశ్రమలో సోదరీమణులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాధ, అంబిక. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలలో నటించారు. అప్పట్లో వీరు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో వీరిద్దరూ నటించారు. వీరిద్దరూ కలిసి నటిస్తే కచ్చితంగా ఆ సినిమా హిట్ అనే ముద్ర ఆ రోజుల్లో ఉండేది. రాధ, అంబిక ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు గా నిలిచారు. రాధ త సోదరి అంబిక మీద పోలీసులకు ఫిర్యాదు […]

Radha Ambika: దక్షిణ సినీ పరిశ్రమలో సోదరీమణులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాధ, అంబిక. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలలో నటించారు. అప్పట్లో వీరు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో వీరిద్దరూ నటించారు. వీరిద్దరూ కలిసి నటిస్తే కచ్చితంగా ఆ సినిమా హిట్ అనే ముద్ర ఆ రోజుల్లో ఉండేది.

రాధ, అంబిక ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు గా నిలిచారు. రాధ త సోదరి అంబిక మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబిక తన చెక్కులను దొంగిలించిందంటూ రాధ పోలీసులను ఆశ్రయించడం సినీ వర్గాలలో చర్చకు దారి తీసింది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. ఇన్ని రోజులపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య వివాదం ఎందుకు ఈ స్థాయి దాకా వచ్చింది..

46 కోట్ల చెక్కుల వివాదం

చెన్నై పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో రాధ తన సంతకంతో ఉన్న ఐదు చెక్కులను.. తనకు తెలియకుండా తీసుకొని.. వాటిని ఉపయోగించి భారీ మొత్తంలో నగదు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాలని అంబిక మీద ఆరోపణలు చేసింది. తన వ్యాపార అవసరాల కోసం ముందుగానే చెక్కుల మీద సంతకం చేసి ఉంచాలని.. అందులో ఐదు చెక్కులను అంబిక పేరుతో బ్యాంకులో వేసినట్టు తనకు సమాచారం అందిందని.. దీంతో బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు రాధ వివరించింది. ఈ చెక్కుల విలువ దాదాపు 46 కోట్ల వరకు ఉండడంతో వివాదం సంచలనంగా మారింది.

అంబిక ఏం చెబుతోంది అంటే

రాధ ఆరోపణలను అంబిక తీవ్రంగా తప్పుపడుతోంది. తాను ఎటువంటి చెక్కులను దొంగిలించలేదని చెబుతోంది. కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు.. వ్యాపారంలో వాటాలు.. బంగారం.. ఇతర అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునే క్రమంలోనే రాధ తనకు చెక్కులు ఇచ్చిందని ఆమె చెబుతోంది. ఒకవేళ రాధ చెబుతున్నట్టు అవి దొంగిలించిన చెక్కులా? అంబిక వాదిస్తున్నట్టు కుటుంబ ఆస్తుల సెటిల్మెంట్ లో భాగంగా ఇచ్చిన చెక్కులా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

ఈ వివాదాన్ని చెక్కులకు సంబంధించిన అంశంగానే చూడకూడదని తెలుస్తోంది.. కుటుంబానికి సంబంధించిన ఆస్తులు.. వ్యాపారంలో వాటాలు.. బంగారం.. అలాగే ఏ ఆర్ ఎస్ గార్డెన్స్ ku సంబంధించిన అంశాలు కూడా ఈ అంశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకాలం వరకు రెండు కుటుంబాల మధ్య ఆర్థిక వివాదాలు లోపల సాగేవని.. ఇప్పుడు అవి బహిరంగ చర్చకు దారి తీస్తున్నాయి..

ఈ వ్యవహారంలో రాధ తనను దొంగ అని అనడం బాధగా ఉందని అంబిక వాపోయింది. మరోవైపు తన సంతకంతో ఉన్న చెక్కులను ఉపయోగించడానికి అంబిక ప్రయత్నించడం సరైన విధానం కాదని రాధ చెబుతున్నారు. చెక్కుల విషయంలో ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరీమణులు రకరకాలుగా మాట్లాడటం మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో రాధ, అంబిక భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. అసలు చెక్కులను రాధ దగ్గర నుంచి అంబిక కు ఎవరు ఇచ్చారు.. అవి అంబిక చేతికి ఎలా వచ్చాయి.. వాటిని ఎవరు ఇచ్చారు.. కుటుంబానికి సంబంధించిన ఆస్తులు.. వ్యాపార వాటాలు.. ఇతర వ్యవహారాలలో ఏదైనా ఒప్పందం కుదిరిందా.. ఈ అంశాలు దర్యాప్తులో చేయాల్సి ఉంది. చివరికి ఈ వివాదం ఎక్కడదాకా వెళ్తుంది.. కుటుంబ సభ్యుల మధ్య రాజీ సాధ్యమవుతుందా.. న్యాయపరమైన పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు.. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper