Lava Virat Curve 5G: బడ్జెట్లో మంచి ఫీచర్లు కావాలా.. అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మీ సొంతం కావాలా.. వారికోసం దేశీయ స్మార్ట్ ఫోన్ దిగ్గజం లావా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.. Lava Virat Curve 5G పేరుతో ఒక కొత్త మోడల్ ఫోన్ ను ప్రవేశపెట్టింది.. ఈ ఫోన్ లో Curved display ఉంటుంది. వెనుక భాగంలో ప్రత్యేకమైన మినీ డిస్ ప్లే కూడా ఇందులో ఉంటుంది. అది టెక్ వర్గాలను ఆసక్తికి గురిచేస్తుంది.
Curved AMOLED display
విరాట్ కర్వ్ 5జీ మోడల్ ఫోన్ లో 6.67 అంగుళాల FHD+ 3D Curved AMOLED display ఇందులో ఉంది. స్క్రీన్ 120 HZ రీ ఫ్రెష్ రేట్ తో వస్తుంది. గరిష్టంగా 1,100 నిట్స్ బ్రైట్నెస్, 10 బిట్ కలర్ depth, 1.07 billion colours వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1920 Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ ఇందులో ఉంది. అందువల్ల తక్కువ వెలుతురులో కూడా స్క్రీన్ చూడడం సౌకర్యవంతంగా ఉంటుంది.
వెనుక చిన్న స్క్రీన్
ఈ ఫోన్లో ఉన్న ప్రధాన ప్రత్యేకత ఇదే. కెమెరా పక్కనే రియల్ మినీ స్క్రీన్ ఉంది. ఫోన్ టేబుల్ మీద బోర్లా పెట్టిన సరే.. కొంతమేర ముఖ్యమైన సమాచారాన్ని.. దీని ద్వారా చూసేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ల సమయం.. బ్యాటరీ శాతం.. చార్జింగ్ స్టేటస్.. వాల్యూమ్ వంటివి ఈ స్క్రీన్ మీద చూడొచ్చు కష్టం టెక్స్ట్.. ఎమోజిలను కూడా డిస్ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫీచర్ వల్ల ఈ మోడల్ ఫోన్ కు ప్రత్యేకమైన లుక్కు కనిపిస్తోంది.
Mediatech diamensity 7100 processor
ఫోన్ పనితీరును అత్యుత్తమంగా ఉంచేందుకు ఇందులో మీడియా టెక్ డైమన్ సిటీ 7100 చిప్ సెట్ ఇందులో ఉపయోగించారు. దీనికి 6GB LPDDR5 RAM, 128 GB స్టోరేజీ జత చేశారు. అదనంగా 6 జిబి వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఇందులో ఉంటుంది.
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్.. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కంపెనీ ఇస్తుంది.
కెమెరా ప్రకారం చూసుకుంటే
ఈ ఫోన్లో 50 మెగా ఫిక్స్ సోనీ కెమెరా ఉంది. దీనికి ఈఐఎస్ సపోర్టు ఉంది. నైట్ మోడ్.. ప్రో వీడియో.. డ్యూయల్ వ్యూ వీడియో.. మోషన్ ఫోటో.. స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం.. వీడియోల కోసం ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
6000 mAh బ్యాటరీ
బ్యాటరీ విషయంలో విరాట్ కర్వ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇందులో 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది. ప్రత్యకమైన సాకెట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 33 డబ్ల్యూ చార్జర్ అందిస్తున్నట్టు లావా కంపెనీ ప్రకటించింది. ఫోన్ ఎక్కువసేపు వాడినా సరే బ్యాటరీ శక్తి ఏమాత్రం తగ్గదు.
డిజైన్ విషయంలో కూడా ప్రీమియం మోడల్ లాగా కనిపిస్తోంది. వెగన్ లెదర్ ఫినిష్ దీనికి అందించారు. ఫోన్ బరువు దాదాపు 184 గ్రాముల వరకు ఉంటుంది. ఐపీ 64 రేటింగ్..MIL STD 810H మిలటరీ గ్రేడింగ్ సర్టిఫికేషన్ దీనికి ఉంది.
డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫేస్ అన్లాక్.. ఐ ఆర్ బ్లాస్టర్.. ఎన్ ఎఫ్ సి.. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వాటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా విరాట్ కర్వ్ 5జీ మోడల్ ఫోన్ ను 6GB + 128 GB స్టోరేజ్ లో విడుదల చేశారు. దీని సాధారణ ధర 23,999. లాంచింగ్ ఆఫర్లో.. బ్యాంకు డిస్కౌంట్లను కలుపుకొని 19,999 కు లావా కంపెనీ అందిస్తోంది. ఈ మోడల్ ఫోన్ ఈనెల 28 నుంచి సాయంత్రం ఏడు గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులోకి వస్తుంది. హెరిటేజ్.. ఇండిగో.. మకరన ఐపోరి.. ఎల్లోరా సాల్ట్ అనే రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది.
మొత్తంగా ఈ ఫోన్లో carved AMOLED display, వెనుక భాగంలో మినీ స్క్రీన్, Dimencity 7100 processor, 50 megapixel Sony camera, 6000 mAh బ్యాటరీ.. ఆండ్రాయిడ్ 16.. ఇలా అనేక రకాల ఫీచర్లతో లావా కర్వ్డ్ ప్రత్యేకమైన కాంబినేషన్తో వచ్చింది. లాంచింగ్ ఆఫర్లు ఈ ఫోన్ కేవలం 20 వేల లోపు లభించడం అత్యంత ఆసక్తికరం. అయితే ఇది బ్యాంక్ ఆఫర్ తో కూడిన లాంచ్ ధర అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వెనుక ఉన్న చిన్న స్క్రీన్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ దేశీయ 5జీ ఫోన్ మార్కెట్లో ఏ స్థాయిలో సత్తా చాటుతుందో చూడాలి.