Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ముంబై లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది మే చివర్లోపు అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని టాక్. ఇప్పటి వరకు దాదాపుగా 40 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందట. ఏప్రిల్ లో అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్ లో హీరోయిన్ గా నటించి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన రష్మిక మందాన కూడా ఈ చిత్రం లో నటిస్తోంది. కానీ ఈసారి హీరోయిన్ గా మాత్రం కాదు, విలన్ గా. ఈ చిత్రం లో డైరెక్టర్ అట్లీ రష్మిక ని పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు అట. రీసెంట్ గానే ఈమె ముంబై షెడ్యూల్ లో అడుగుపెట్టింది. ఆమె పై కొన్ని సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ అట్లీ. ముందుగా ఈ విలన్ క్యారెక్టర్ కోసం సమంత ని సంప్రదించారు. కానీ ఈమధ్య కాలం లో ఆమె ఎక్కువ విలన్ రోల్స్ లోనే కనిపిస్తుండడంతో కొంత బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఈ క్యారెక్టర్ కి నో చెప్పింది. కానీ రష్మిక కు ఇదే మొట్టమొదటి విలన్ రోల్. ఈమధ్య కాలం లో ఆమె కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది కాబట్టి, తాను ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ కావడంతో వెంటనే ఒకే చెప్పేసింది.
కానీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ పీక్ రేంజ్ లో ఉన్న ఏకైక హీరోయిన్ రష్మిక మాత్రమే. అలాంటి రష్మిక , కెరీర్ పీక్ టైం లో ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం అనేది నిజంగా సాహసమనే చెప్పాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది లోనే పూర్తి స్థాయి షూటింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ని పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రాన్ని, వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దింపే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సమ్మర్ కి ఇప్పటికే రాజమౌళి వారణాసి, ప్రభాస్ స్పిరిట్ చిత్రాలు ఖరారు అయ్యాయి. ఇప్పుడు అల్లు అర్జున్- అట్లీ మూవీ కూడా తోడు అయితే పీక్ టాలీవుడ్ ని చూడొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.