Homeఎంటర్టైన్మెంట్Vishvambhara Budget: హద్దులు దాటేసిన 'విశ్వంభర' బడ్జెట్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అసాధ్యమేనా?

Vishvambhara Budget: హద్దులు దాటేసిన ‘విశ్వంభర’ బడ్జెట్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అసాధ్యమేనా?

Vishvambhara Budget: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ఈ సినిమా పై ఆరంభం లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. కాన్సెప్ట్ వీడియో కే ఫ్యాన్స్ , ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం కచ్చితంగా విజువల్ వండర్ గా నిలుస్తుందని, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ […]

Vishvambhara Budget: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ఈ సినిమా పై ఆరంభం లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. కాన్సెప్ట్ వీడియో కే ఫ్యాన్స్ , ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం కచ్చితంగా విజువల్ వండర్ గా నిలుస్తుందని, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ చిత్రం నుండి టీజర్ వచ్చిందో, అప్పటి నుండి అంచనాలు పూర్తిగా పడిపోయాయి. ఇదేదో విజువల్ వండర్ అవుతుందని అందరూ భావిస్తే, అమీర్ పెట్ గ్రాఫిక్స్ తో లాగించేసారు ఏంటి?, దీని కోసం ఇంత బడ్జెట్ పెట్టారా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. అభిమానులు కూడా ఆ గ్రాఫిక్స్ ని చూసి చీదరించుకున్నారు.

టీజర్ లోని గ్రాఫిక్స్ క్వాలిటీ ని చూసి సోషల్ మీడియా నుండి వచ్చిన ట్రోల్స్ ని మూవీ టీం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక అప్పటి నుండి గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి, కొత్త గ్రాఫిక్స్ కంపెనీ కి షిఫ్ట్ అయ్యారు. అలా VFX షాట్స్ మొత్తం పై రీ వర్క్ చేశారు. దీని వల్ల నిర్మాతకు బడ్జెట్ డబుల్ ఖర్చు అయ్యింది. ఏ నిర్మాత అయినా సినిమాలకు బడ్జెట్ ని ఫైనాన్షియర్స్ నుండే తీసుకొస్తారు. ఈ సినిమాకు కూడా అలాగే చేశారు. సినిమా విడుదల ఆలస్యం అవుతూ రావడంతో వడ్డీలు పెరిగిపోయి ఎవ్వరూ ఊహించనంత బడ్జెట్ అయ్యింది అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయ్యిందని, అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే 130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయ్యిందని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ దాదాపుగా 75 కోట్ల రూపాయిలు ఉంటుందని, ఇతర క్యాస్టింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇలా అన్నీ కలిపి ఈ చిత్రానికి 250 కోట్లు ఖర్చు అయ్యిందని అంటున్నారు.

ఇది సాధారణమైన విషయం కాదు, మెగాస్టార్ చిరంజీవి కి ప్రస్తుతం అంత మార్కెట్ లేదు. ఆయన లేటెస్ట్ సూపర్ హిట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి 180 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంత పెద్ద సూపర్ హిట్ సినిమాకే అంత షేర్ వసూళ్లు వస్తే, పాత బడిపోయిన ‘విశ్వంభర’ చిత్రానికి 250 కోట్ల షేర్ థియేటర్స్ నుండి రావడం అంటే చాలా కష్టమే. పైగా ఓటీటీ బిజినెస్ కూడా ఈమధ్య కాలం లో థియేటర్స్ లో విడుదలై ఫలితాన్ని ఆధారంగా తీసుకొని మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమా డెఫిసిట్స్ లోనే ఉంది. ఇక నుండి ఈ చిత్రం నుండి రాబోయే ప్రతీ కంటెంట్ వేరే లెవెల్ లో ఉండాలి, ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించాలి, అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper