సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ మీద హీరో హీరోయిన్లు కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. వాళ్లు చేసే యాక్టింగ్ అలాగే హీరో – హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావాలి. వాళ్ళ జోడి పెర్ఫెక్ట్ గా కుదిరినప్పుడే ప్రేక్షకులు ఆ మూవీని చూడాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. స్క్రీన్ మీద కెమిస్ట్రీ అద్భుతంగా పండించగలిగే నటి నటులు ఎవరు ఈ జనరేషన్ లో ఉన్న హీరో హీరోయిన్లలో ఎవరెవరికి బాగా సెట్ అయిందనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
విజయ్ దేవరకొండ – రష్మిక మందాన
వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘గీతా గోవిందం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. మొత్తానికైతే వీళ్ళిద్దరూ టాప్ హీరో హీరోయిన్లుగా మారిపోయారు. ఇక ఈ సంవత్సరం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైపోయారు. ప్రస్తుతం విల్లా కాంబోలో ‘రణబాలి’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాతో మరోసారిసక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు…
రామ్ చరణ్ – సమంత
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ వచ్చిన ‘రంగస్థలం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాతో వీళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి విల్లా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా హెల్ప్ అయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. సమంత అవేంటనే నాగచైతన్య పెళ్లి చేసుకుని సెటిలైపోవడం. అతనితో విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని రాజ్ నిడిమూరు అనే దర్శకుడిని పెళ్లి చేసుకోవడంతో ఆమె పెద్దగా సినిమాల వైపు అడుగులు వేయడం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తుంది…
నాని – కీర్తి సురేష్
నాని – కీర్తి సురేష్ కాంబినేషన్ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో నేను లోకల్, దసరా లాంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ దక్కింది. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తే చూడడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు…
