Allari Naresh: అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ కామెడీ జానర్ సినిమా చేస్తున్నాడు అనే వార్త వచ్చినప్పటి నుండే ఈ చిత్రం పై మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. టీజర్ విడుదల తర్వాత క్వాలిటీ బాగాలేదు , హీరోయిన్స్ ఎంపిక బాగాలేదు అనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి కానీ, చాలా కాలం తర్వాత రాబోతున్న ఒక కామెడీ ఎంటర్టైనర్ కావడంతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం కావడంతో , కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం పెట్టుకున్నారు బయ్యర్స్. మరి నేడు విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
టీజర్ చూసినప్పుడు ఈ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో అనే చిన్న అనుమానం ఉండేది, కానీ ట్రైలర్ ని చూసిన తర్వాత అల్లరి నరేష్ ఈ సినిమాతో కచ్చితంగా కం బ్యాక్ ఇస్తాడని అర్థం అవుతోంది. తన కోరిక మేరకు రంభ , ఊర్వశి , మేనకా తన వద్దకు రావడం. అల్లరి నరేష్ తన కోరికల చిట్టా విప్పడం, కానీ ఇంద్ర దేవుడు వారి నుండి పవర్స్ మొత్తం తీసేసుకున్నారనే విషయం తెలియడం తో అల్లరి నరేష్ షాక్ అవ్వడం వంటివి ఈ ట్రైలర్ లో చాలా ఫన్నీ గా అనిపించాయి. అసలే మిడిల్ క్లాస్ కుటుంబం, అదనపు భారంగా ఈ రంభ , ఊర్వశి , మేనకా లను పోషించడం , ఈ క్రమం లో హీరోకి ఎదురైనా ఇబ్బందులు , తద్వారా ఏర్పడే ఫన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ ని మరోసారి ఈ సినిమాలో చూపించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గానే ఆయన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ మూడవ సీజన్ లో ఇంద్రుడిగా కనిపించి , తన మార్కు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేశాడు . ఇప్పుడు మరోసారి ఆయన అదే పాత్రలో కనిపించడం విశేషం. ఇకపోతే ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు , ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చివర్లో అల్లరి నరేష్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం లోని ఫేమస్ డైలాగ్ ‘వాషీ ఓ వాషీ’ డైలాగ్ కి స్పూఫ్ చేస్తూ ‘రాశీ ఓ రాశీ’ అని డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిల్చింది. ఓవరాల్ గా ట్రైలర్ తో బ్లాక్ బస్టర్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , విడుదల తర్వాత కూడా ఆడియన్స్ కి అదే ఫీలింగ్ ని కలిగిస్తుందో లేదో చూడాలి.