Photo Story: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..?, ఈ ఫోటో ‘ఆవిడ..మా ఆవిడే’ చిత్రం షూటింగ్ సమయం లోనిది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ విరామం లో నాగార్జున వీరాభిమాని అయినటువంటి ఈ బుడ్డోడు ఆయనతో ప్రేమగా తీసుకున్న ఫోటో ఇది. ఈ బుడ్డోడికి ఇప్పుడు టాలీవుడ్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. మొదటి సినిమా నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే క్యారెక్టర్స్ కూడా చేసాడు. ఆయన మరెవరో కాదు, ఈవీవీ సత్యనారాయణ చిన్న కుమారుడు, అల్లరి నరేష్(Allari Naresh).
అల్లరి చిత్రం తో కామెడీ హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించాడు. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోల రాజ్యం నడుస్తున్న సమయం లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ జానర్ సినిమాలు చేసి, తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని నిన్నటి తరం ఆడియన్స్ లో ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో, నేటి తరం ఆడియన్స్ లో అలా అల్లరి నరేష్ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం కామెడీ హీరో రోల్స్ కి మాత్రమే ఆయన పరిమితం అవ్వలేదు. గమ్యం, విశాఖ ఎక్స్ ప్రెస్, మహర్షి, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో అబ్దుతమైన క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకుల చేత విలక్షణ నటుడు అని అనిపించుకున్నాడు. ఈమధ్య కాలం లో కామెడీ సినిమాలకు దూరమైన అల్లరి నరేష్ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు.
ఈ జానర్ లోకి ఆయన వచ్చిన తర్వాత ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి చిత్రాలు బాగా ఆడాయి కానీ, అత్యధిక శాతం సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన ’12a రైల్వే కాలనీ’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో ఒక మోస్తరు బజ్ అయితే ఉంది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. హీరో నరేష్ కూడా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. కనీసం ఈ చిత్రం తో అయినా అల్లరి నరేష్ ఆయన్ని అభిమానించే వాళ్ళు కోరుకునే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.