Allari Naresh Grandfather Passed Away: ప్రముఖ సినీ హీరో అల్లరి నరేష్(Allari Naresh) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లరి నరేష్ తాత, ఈవీవీ సత్యనారాయణ రావు తండ్రి ఈదర వెంకట్రావు నేడు ఉదయం తెల్లవారు జామున కన్నుమూసినట్టు అల్లరి నరేష్ కుటుంబం మీడియా కి తెలిపింది. ఆయన వయస్సు ప్రస్తుతం 90 ఏళ్ళు. వృద్దాప్యం కారణంగా ఈమధ్య కాలం లో ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారట. ఈ క్రమంలోనే మంగళవారం నాడు తన స్వగృహం లో తుదిశ్వాస వదిలారని అల్లరి నరేష్ కుటుంబం చెప్పుకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా లోని కోరుమామిడి గ్రామంలో నిన్న సాయంత్రం అంత్యక్రియ కార్యక్రమలు నిర్వహించినట్లు సమాచారం. తన తాత గారితో చిన్న తనం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అల్లరి నరేష్ తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యాడట. తన మనసుకి ఎంతో దగ్గరైన తాత చనిపోవడం మా కుటుంబానికి తీరని లోటు అంటూ అల్లరి నరేష్ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇకపోతే వెంకట్రావు మృతి పట్ల టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు అల్లరి నరేష్ కి, ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఇది ఇలా ఉండగా, ఈదర వెంకట్రావు , వెంకటరత్నం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు ఈవీవీ సత్యనారాయణ. టాలీవుడ్ లో ఈయన ఒక ప్రభంజనం. ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి లెజండరీ డైరెక్టర్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య సమస్యలతో దురదృష్టం కొద్దీ ఈవీవీ సత్యనారాయణ 2011 వ సంవత్సరం లోనే కన్నుమూశారు. ఇక ఆయన తల్లి వెంకటరత్నం 2019 వ సంవత్సరం లో చనిపోయారు. తానూ బ్రతికి ఉండగానే పెద్ద కొడుకు ఈవీవీ సత్యనారాయణ, అలాగే తన సతీమణి చనిపోవడం, పెద్ద వయస్సులో వెంకట్రావు కి ఎంతటి మానసిక ఆవేదన కలిగి ఉంటుందో ఊహించుకోవచ్చు.
అదే సమయం లో ఆయనకు తన మనవడు అల్లరి నరేష్ పెళ్లి ని చూసి భాగ్యం, అతని పిల్లలతో ఆడుకునే అదృష్టం కూడా కలిగింది. సంక్రాంతి పండుగలు ముగిసిన వెంటనే వెంకట్రావు కాలం చెందాడు. ఇది గమనించాల్సిన విషయం. ఈ విషాద సమయం లో అల్లరి నరేష్ కి మరియు ఆయన కుటుంబానికి ఆ దేవుడు కొండంత బలం ఇవ్వాలని కోరుకుందాం. ఈమధ్య కాలం లో అల్లరి నరేష్ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఇది ఆయనకు ఒక మానసిక ట్రామా కి గురి చేసే విషయం. అలాంటి సమయం లో తానూ ఎంతో అభిమానించే తాత గారు కూడా చనిపోవడం, అల్లరి నరేష్ మానసిక పరిస్థితిని ఏ స్థాయిలో దెబ్బ తీసి ఉంటుందో ఊహించుకోవచ్చు.
