Homeఆంధ్రప్రదేశ్‌Tammineni Sitaram: అప్పలరాజు సరే.. తమ్మినేనిని పరామర్శించరా జగన్?!

Tammineni Sitaram: అప్పలరాజు సరే.. తమ్మినేనిని పరామర్శించరా జగన్?!

Tammineni Sitaram: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కొనసాగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని సీనియర్ నేతలతో పడుతున్నారు. ఈరోజు జగన్ శ్రీకాకుళం వస్తున్నారు. శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జగన్ వైఖరిని ఒక సామాజిక వర్గం విపరీతంగా వ్యతిరేకిస్తోంది. ఆపై సీనియర్ నేతలుగా ఉన్న ఇద్దరు […]

Tammineni Sitaram: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కొనసాగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని సీనియర్ నేతలతో పడుతున్నారు. ఈరోజు జగన్ శ్రీకాకుళం వస్తున్నారు. శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జగన్ వైఖరిని ఒక సామాజిక వర్గం విపరీతంగా వ్యతిరేకిస్తోంది. ఆపై సీనియర్ నేతలుగా ఉన్న ఇద్దరు ఆగ్రహంతో ఉన్నారు. వారే తమ్మినేని సీతారాం తో పాటు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు ఆ ఇద్దరూ చేతులు కలిపారు. టిడిపి తో పాటు వైసిపి పై కూడా రగిలిపోతున్నారు. జగన్ వైఖరి పట్ల అయితే తమ్మినేని ఓ రేంజ్ లో ఆగ్రహంతో ఉన్నారు.

* ఈరోజు జగన్ పరామర్శ..
కుమారుడి బైక్ ప్రమాదం కేసును తప్పుదోవ పట్టించినందుకు గాను మాజీ మంత్రి అప్పలరాజు పై కేసు నమోదు అయింది. ఆయన అరెస్ట్ కూడా జరిగింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. 18 సంవత్సరాల కుర్రాడు బైక్ ప్రమాదం చేస్తే తప్పు కాదు అన్నట్టు మాట్లాడారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసినట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు శ్రీకాకుళం వచ్చి అప్పలరాజును పరామర్శిస్తున్నారు. దానిని ఒక బలప్రదర్శనగా చూస్తున్నారు. శ్రీకాకుళం వస్తున్న జగన్ అక్కడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మినేని విషయంలో స్పందించకపోవడం మాత్రం గమనార్హం.

* సంబంధం లేదని ప్రకటించిన తమ్మినేని..
మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం మొత్తం ఓ భూ వివాదంలో చిక్కుకుంది. అసలైన యజమాని ఉండగా ఆయన వారసురుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి నాలుగు కోట్ల రూపాయల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని సీతారాం భార్యతో పాటు కుమారుడు పాత్ర ఉందని తేల్చి వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తమ్మినేని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హైకోర్టులో తమ్మినేని దంపతులకు మాత్రమే ముందస్తు బెయిల్ లభించింది. కుమారుడికి లభించకపోవడంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే అప్పలరాజు సైతం తన కుమారుడిని తప్పించే క్రమంలో కేసును తప్పుదోవ పట్టించారు. కానీ ఈ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తన తప్పులేదు అని తమ్మినేని చెబుతున్నారు. విక్రయించిన వారే నకిలీ పత్రాలు సృష్టించారని.. అందులో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అంటున్నారు. అక్కడ కేసు తప్పుదోవ పట్టించిన అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. ఏ తప్పు చేయని తమ్మినేనిని పరామర్శించకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తమ్మినేనిని వదిలించుకునేందుకు జగన్ సిద్ధపడ్డారన్న వార్తల నేపథ్యంలో.. తమ్మినేని సీతారాం సైతం తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper