Homeటాప్ స్టోరీస్Ramayana Movie: రాముడిని మించిపోయిన రావణుడు.. ఎలా ఉంటే "రామాయణం" బాగుండేది..

Ramayana Movie: రాముడిని మించిపోయిన రావణుడు.. ఎలా ఉంటే “రామాయణం” బాగుండేది..

Ramayana Movie: భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటి రామాయణం. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. రాముడిగా రణ్ బీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యష్ నటించారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటినుంచి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై ఎలా చూపిస్తారు అని ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అయితే ఈ సినిమా […]

Ramayana Movie: భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటి రామాయణం. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. రాముడిగా రణ్ బీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యష్ నటించారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటినుంచి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై ఎలా చూపిస్తారు అని ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా ప్రేక్షకులు నచ్చిందా.. ఏ పాత్ర ఎక్కువగా ఆకట్టుకుంది.. ఏ అంశాలపై విమర్శలు వస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకుందాం.

రావణుడి పాత్ర

ఈ సినిమాలో యష్ రావణుడి పాత్ర పోషించారు. ఆయన రూపం.. పది తలల సన్నివేశాలు.. అతని పాత్రకి ఇచ్చిన ప్రాధాన్యం చర్చకు దారి తీస్తున్నాయి. కేవలం ప్రతినాయకుడిగా మాత్రమే కాకుండా.. అతడి ఆలోచనలు.. వ్యక్తిత్వంలో ఉన్న మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి రామాయణంలో ఉన్న రావణుడి పాత్రను మార్చి చూపిస్తున్నారా.. అతడికి ఎక్కువ సానుభూతి కలిగించే విధంగా కథను రూపొందించారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

రణ్ బీర్ కపూర్ నటన పై చర్చ

రాముడి పాత్రలో నటించిన రణ్ బీర్ కపూర్ నటన మీద చర్చ నడుస్తోంది. ఇతడి పాత్రలో సమయమనం.. హుందాతనం ప్రదర్శించారని కొందరు చెబుతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇద్దరి జోడి విషయంలో మాత్రం ప్రేక్షకులు ఒకే అభిప్రాయానికి రాలేకపోతున్నారు. కొందరికి వారి పాత్రలు నచ్చితే.. మరికొందరు మరింత భావోద్వేగమైన సన్నివేశాలను ఆశించామని అంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి ప్రేక్షకులు చర్చించుకుంటున్న మరో అంశం విజువల్ ఎఫెక్ట్స్. అయోధ్య నగర నిర్మాణం.. భారీ సెట్లు.. పెద్ద సన్నివేశాలు.. జటాయువు ఘట్టం వంటి అంశాలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి సినిమాల తరహాలోనే భారీ విజువల్స్ ఇందులో ఉన్నాయి. కొన్ని సిజిఐ సన్నివేశాలు.. రాక్షసుల రూపకల్పన.. గ్రీన్ స్క్రీన్ వినియోగం మీద విమర్శలు వస్తున్నాయి. సినిమా నిడివి.. కథనం విషయంలో కూడా ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కైకేయి వరాలు.. భరతుడి పాత్ర.. సీత పహరణం వంటి కీలక ఘట్టాలకు మరింత సమయం కేటాయించి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

భారీ బడ్జెట్ తో సినిమా తీసినంత మాత్రాన ప్రేక్షకులకు భావోద్వేగమైన అనుభూతి కలగదని.. కథలో ఉన్న పాత్రలు.. వాటి మధ్య ఉన్న సంబంధాలు బలంగా ఉండాలని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ వెర్షన్ విషయంలో కూడా చర్చ నడుస్తోంది. హిందీ వెర్షన్ తో పోల్చి చూస్తే ఇంగ్లీష్ వర్షన్ నిడివి తగ్గించారు. డబ్బింగ్ లో లిప్సింక్ వంటి అంశాలపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రామాయణం చుట్టూ రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారీ నిర్మాణ విలువలు.. విజువల్స్.. యశ్ నటనకు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు కథనం.. భావోద్వేగాలు.. ఇతిహాసాన్ని తెరపై చూపించిన విధానం మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రామాయణం అంటే ఇతిహాసాన్ని సినిమాగా రూపొందించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కథతో భావోద్వేగమైన అనుబంధం ఉంటుంది. అందుకే ఈ సినిమాను చూసినవారు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper