Homeఎంటర్టైన్మెంట్Rajinikanth On Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ పై రజనీ షాకింగ్ లెటర్.. ఏంటి ఇలా...

Rajinikanth On Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ పై రజనీ షాకింగ్ లెటర్.. ఏంటి ఇలా రాశాడు?

Rajinikanth On Chandramukhi 2: హర్రర్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చింది. 2005లో పి. వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించారు. ఇందులో చంద్రముఖిగా జ్యోతిక నటించి పాన్ ఇండియా లెవల్లో భయపెట్టింది. తాజాగ పి. వాసు నే చంద్రముఖి 2 ను తీసుకొచ్చారు. ఇందులో రజనీ ప్లేస్ లో లారెన్స్ నటించగా.. చంద్రముఖి గా బాలీవుడ్ నటి కంగనా రానౌత్ నటించింది. చంద్రముఖి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ టీవీల్లో వస్తూ అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రముఖి 2 థియేటర్లోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో చంద్రముఖి పార్ట్ 1 లో నటించిన రజనీకాంత్ ఓ లెటర్ ను రాశాడు. ఇందులో రజనీ రాసిన కామెంట్స్ పై ఆసక్తి చర్చ సాగుతోంది.

చంద్రముఖి పార్ట్ 1లో రజనీకాంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఓ వైపు సైకాలాజికల్ డాక్టర్ గా.. మరోవైపు విచిత్ర మహారాజుగా నటించి ఆకట్టుకున్నారు. ఒక దశలో రజనీనిని రాజు వేషంలో చూసి రియల్ గా అలాగే ఉన్నారేమో అనుకునేంతగా లీనమైపోయాడు. మరోవైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ.. నయనతారతో రొమాన్స్ చేస్తూ… అన్ని విధాలుగా ఆకట్టుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ కంటే రజనీ పాత్ర ఇందులో హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో రజనీ తప్ప వేరే ఎవరూ చేసినా సినిమా హిట్టు కాకపోయి ఉండేదని కొంతమంది ఆసక్తిగా చర్చించుకుంటారు.

ఈ తరుణంలో చంద్రముఖి 2 రిలీజ్ పై కొన్ని ట్రోలింగ్స్ వెలువడ్డాయి. చంద్రముఖి 2లో రజనీ ప్లేసులో రాఘవ లారెన్స్ నటించారు. ఈయన ఇప్పటికే సొంతంగా పలు హర్రర్ సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చంద్రముఖి 2లో ఎంతో ప్రయత్నించినా రజనీ లా నటించలేవని కొందరు సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక పార్ట్ 1 లో ఉన్న హర్రర్ నెస్ ఇందులోలేదని కొంరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఈ మూవీపై రజనీకాంత్ సంచలన విషయాలను వెల్లడిస్తూ ఓ లెటర్ రాశాడు. ఇందులో ‘నా స్నేహితుడు పి. వాసు తన చంద్రముఖి సినిమాను కొత్త యాంగిల్ లో చూపించడానికి చంద్రముఖి 2 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పి.వాసు, రాఘవ లారెన్స్ తో పాటు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు’ అని లెటర్లో రాశాడు. ఈ లెటర్ ను నిర్మాతలు తమ సోషల్ మీడియా ఖాతలో పోస్టు చేసి హల్ చల్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper