Rajamouli: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది.
Also Read: అక్కడ సరైన ప్రమోషన్స్ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు తగ్గలేదుగా?
తాజాగా, తెలుగులో ప్రమోషన్స్ నిమిత్తం చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా చిత్రాల గురించి చెప్పాలంటే.. అసలు దాన్ని ఎలా నిర్ణయిస్తామో తెలియాలి. అంటూ వివరించారు. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటేనో, బడ్జెట్ భారీగా ఉంటేనో ఓ సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
బాహుబలి తీసినా కూడా నా సినిమాల పరంగా నేను చెప్పగలను ఏ సినిమా పాన్ ఇండియా అవుతుందని అంటూ చెప్పుకొచ్చారు. భాషతో సంబందం లేకుందా సినిమా అర్థం అవుతే.. అదే పాన్ ఇండియా అంటూ రాజమౌళి చిన్న మాటతో అందర్నీ కట్టిపడేశారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబయి చేరుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందురో రామ్‌చరణ్, తారక్ హీరోలుగా నటించారు.
Also Read: బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా మాస్ మహారాజ్?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rajamouli about pan india movies at brahmastra press meet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com