SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనేది వాస్తవం… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… రాజమౌళి ఈసారి ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది. ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు రాజమౌళి చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినా కూడా తన సినిమాల్లో కొంతమంది ఆర్టిస్టులు కామన్ గా కనిపిస్తూనే ఉంటారు.
ముఖ్యంగా రాజీవ్ కనకాల, శేఖర్ లాంటి ఆర్టిస్టులు సైతం రాజమౌళి చేసిన అన్ని సినిమాల్లోనూ మనకు కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళితో పాటు ట్రావెల్ చేశారు. రాజమౌళి ‘శాంతినివాసం’ సీరియల్ లో కూడా వీళ్ళు కీలకపాత్రల్లో నటించారు. అందువల్లే వీళ్లను అప్పటినుంచి రాజమౌళి తన స్నేహితులుగా భావిస్తూ తన ప్రతి సినిమాలో ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
తను డైరెక్టర్ గా మారిన తర్వాత చేసిన ప్రతి సినిమాలో వాళ్లకోసం స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేయిస్తున్నాడు. వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టడంలో రాజమౌళి కీలకపాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి… రాజమౌళి స్నేహానికి చాలా వాల్యూ ఇస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం చేస్తున్న వీళ్ళిద్దరి కోసం సపరేట్ క్యారెక్టర్లు కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఏది ఏమైనా కూడా రాజమౌళి తన ఎంటైర్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో అతను ప్రపంచ స్థాయి దర్శకుడిగా మారడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని సైతం ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…