అందాల భామ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ భామ అభిమానులు తల్లడిల్లిపోతారు. అలాంటిది బోల్డ్ సమాజంలో అగ్రస్థానాన్ని సంపాదించుకుని ఎందరో రసిక హృదయాలను రంజింపజేసిన హాట్ బ్యూటీ ఏడిస్తే ఇక అసలు చూడలేము. కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు ప్రజలు. ఈ క్రమంలో ‘ఆర్‌ఎక్స్ 100′ భామ పాయల్ రాజ్ పుత్ కూడా తనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోయానని ఎంతో బాధగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
పాయల్ పోస్ట్ చేస్తూ ‘నా లైఫ్ లో ప్రస్తుత పరిస్థితి అతి క్లిష్టమైనది. ఈ దశను నేను బాధతో దాటలేకపోతున్నా. నాకు ఎంతో బాధగా ఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను బయటకు చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నేను నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఆ దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దయచేసి అందరూ మీ కుటుంబ సభ్యుల్ని సంరక్షించుకోవాలి, ఈ విషయాన్ని అందరికీ సూచించాలి, జాగ్రత్తగా ఉండండి’ అంటూ పాయల్ ఎమోషనలై పోస్ట్ పెట్టారు. ఇంతకీ పాయల్ కోల్పయిన వ్యక్తి ఎవరంటే.. ఆమె ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి ‘అనితా’ని. పాయల్ రాజ్ పుత్ కి కాబోయే అత్త అనితా కరోనా కారణంగా మృతి చెందారు. ఆమె మరణ వార్త వినగానే పాయల్ ఎంతగానో బాధ పడింది.
ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ హాట్ భామ కన్నడ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ దర్శక నిర్మాతలు తన పై ఇంట్రెస్ట్ చూపించాలనే స్లిమ్ గా నాజుగ్గా తయ్యారైంది.