కరోనా మహమ్మారి, అలాగే ఈ లాక్ డౌన్ లేకపోయి ఉండి ఉంటే, సమ్మర్ స్పెషల్ అంటూ హీరోయిన్ల బికినీ వ్యవహారాలు మరోలా రచ్చ చేసి ఉండేవి. బీచ్ ల సరిహద్దుల్లో చల్లని సముద్రపు వాసనతో ఆ క్షణాలను ఉహించుకుంటూ హీరోయిన్లు ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. అయితే, ఆస్వాధించగలిగే వాళ్లకు ప్రతి రోజూ అందంగానే ఉంటుంది అన్నట్టు,
కొంతమంది భామలు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ ఆ సమయంలో హాట్ ఫోటోలు తీయించుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు. ప్రత్యేకించి అలాంటి హీరోయిన్లు సోషల్ మీడియాలో చేసే హడావుడే వేరు. సహజంగా సమ్మర్ వెకేషన్లు, మాన్ సూన్ లో విహారాలకు బాగా అలవాటు పడిన వాళ్లకు ఈ కరోనా రోజులు చాలా కష్టంగా మారాయనే చెప్పాలి.
ఎలాగూ ఇప్పుడిప్పుడు పరిస్థితి కూడా మారే అవకాశం లేదు కాబట్టి, సెలబ్రిటీలు సైతం ఇళ్లు దాటాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా కొన్ని ప్రేమ జంటలు రిస్క్ చేస్తున్నాయి. ఈ లాక్ డౌన్ లో బీచ్ లకు ఎలా చేరతారని అనుకునేలోపే, బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది గోవా చేరి, అక్కడ బీచ్ లలో, బీచ్ లకు అనుకుని ఉన్న తమ విల్లాల్లో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.
అంటే తమ లాక్ డౌన్ రోజులను గోవాలో ప్లాన్ చేసుకున్నారు కొన్ని క్రేజీ జంటలు. ప్రస్తుతానికి అయితే, ఏ జంట కూడా ఇంతవరకు గోవా ట్రిప్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. వైట్ బీచ్ వేర్ లో స్టన్నింగ్ పోజులను ఇవ్వడానికి అలవాటు పడిన బ్యూటీలు ఎక్కువ కాలం ఇలా సైలెంట్ గా ఉండరు, కాబట్టి గోవా నుండి హాట్ ఫోజులు త్వరలోనే వైరల్ కానున్నాయి.