Mrunal Thakur : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే టాప్ హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). తనకు సంబంధించిన ఫోటోలను, రీల్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. నెటిజెన్స్ కూడా ఈమెను మిలియన్ల సంఖ్యలో ఫాలో అవుతూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ఎమోషనల్ అవుతూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో వరుణ్ ధావన్(Varun Dhawan), పూజా హెగ్డే(Pooja Hegde) కాంబినేషన్ లో డేవిడ్ ధావన్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఇదే సినిమాలో నాగిని ఫేమ్ మౌనీ రాయ్(Mouni Roy) కూడా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి గ్లాస్గవ్ అనే సిటీ కి ట్రిప్ వెళ్లారు.
Also Read : హీరోయిన్ రాశీ ఖన్నా కి తీవ్ర గాయాలు..ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!
ఈ సందర్భంగా అక్కడ మౌనీ రాయ్ తో తనకు ఏర్పడిన జ్ఞాపకాలను, అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘నా గ్లాస్గవ్ ట్రిప్ ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైన మౌనీ రాయ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీతో నాకు ఏర్పడిన ఈ అనుభందం లో మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మనం ఇద్దరు కలిసి వేసిన ఈ స్టెప్ కి పెద్దగా ప్రాక్టీస్, కొరియోగ్రఫీ లేకపోయినా ఈ ఒక్క షాట్ చాలా అందంగా వచ్చిందని నేను భావిస్తున్నాను. నాలోని ఈ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆమె వేసిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. వీళ్లిద్దరి క్యూట్ బాండింగ్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇద్దరు కూడా సీరియల్ నేపథ్యం నుండి వచ్చిన వారే.
మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్నో సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లో నటించింది. అదే విధంగా మౌనీ రాయ్ కూడా ‘నాగిన్’ సీరియల్ తో ఎంత క్రేజ్ ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ లో ఈమె డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈమె తొలిసారి ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం లో విలన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉంటుంది. అయితే మృణాల్ ఠాకూర్ రేంజ్ వేరే అని చెప్పొచ్చు. వరుసగా క్రేజీ స్టార్ హీరోలతో సినిమాలను ఒప్పుకుంటూ పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. తెలుగులోకి ఈమె సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అడవి శేష్ హీరో గా నటిస్తున్న డెకాయిట్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న మృణాల్ ఠాకూర్, అల్లు అరుణ్ అట్లీ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram