‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్’(ఐఎన్‌జీ). టైటిల్ తో పాటు లోపల కంటెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందట. ప్రియదర్శి, నందిని రాయ్ పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రియదర్శి క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని, అతనిలోని నెగిటివ్ షేడ్స్ ను ఈ సిరీస్ లో బాగా ఎలివేట్ చేశారట.
ఇక ఈ సిరీస్ లో తన క్యారెక్టర్ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నాకు నేను కొత్తగా అనిపించిన పాత్రలో నేను కొత్తగా నటించడానికి ప్రయత్నించాను. మీరందరికీ మా ప్రయత్నం నచ్చుతుంది. తను నటించిన ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కావడం, నిర్మాత అల్లు అరవింద్, సురేశ్ కృష్ణ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.
కాగా విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను బాషా, ప్రేమ, మాస్టర్, డాడీ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు సురేశ్ కృష్ణ మొదటిసారి నిర్మాతగా మారి ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. సురేశ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ వెబ్ సిరీస్ ను నిర్మించమని అల్లు అరవింద్ గారిని నేను అడిగితే, ఆయన నన్నే నిర్మించమని చెప్పారు. దర్శకుడిగా చేసిన నాకు, నిర్మాతగా ఈ ప్రయాణం కొత్తగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
కాగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘నేను బాషా సినిమా చూశాక సురేశ్ కృష్ణతో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్లే ఆయనతో కలిసి నేను నిర్మాతగా మాస్టర్, డాడీ సినిమాలను నిర్మించాను. ఇప్పుడు ఆహా కోసం సురేశ్ ఒక వెబ్ సిరీస్‌ను నిర్మించాడు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.