mobile crematorium : సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా నరకం చూపించింది. లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కరోనా విజృంభిస్తున్న ఆ సమయంలో చనిపోయిన వారిని దహనం చేయడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. చివరికి చనిపోయిన వారి అంత్యక్రియలు జరపడానికి ఎవరూ ముందుకు రాలేదు. చనిపోయిన వారిని ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ విజృంభించిన రోజుల్లో అలాంటి దుస్థితులే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.
కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయినప్పటికీ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.. రోడ్డు ప్రమాదాలలో మృత్యు చెందిన వారికి అంత్యక్రియలు జరపాలంటే ఇప్పటికి ఇబ్బందికరమైన వాతావరణమే ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరాన్ని చెందిన ఓ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది. చక్రాలపై స్మశాన వాటికను రూపొందించి.. చాలామంది ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కార మార్గం చూపింది.. ఈ వాహనంతో పాటు అత్యంత సులువుగా తరలించడానికి పోర్టబుల్ గ్యాస్ క్రిమేటర్ కూడా రూపొందించింది. ఈ వాహనం వినూత్నమైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వాహనాలను సరఫరా చేస్తున్నారు.. ఈ వాహనం ఆరు అడుగుల పెట్టె మాదిరిగా కనిపిస్తోంది. ఈ గ్యాస్ క్రిమేటోరియంలో ఎల్పిజి బర్నర్లు, పైప్ లైన్ వ్యవస్థ ఉంటుంది. వీటికి అనుసంధానంగా మండే చాంబర్ కూడా ఉంటుంది. శరీరం దానమైన తర్వాత అస్తికలు వాటి అంతటావే బయటకు వస్తాయి. కంట్రోల్ ప్యానెల్ ద్వారా అస్తికలు సేకరించి అవకాశం ఉంటుంది. కంట్రోల్ ప్యానెల్ బోర్డు ద్వారా ఇందులో మృతదేహాన్ని దహనం చేయవచ్చు.
ఈ వాహనాన్ని ట్రక్కు లాంటి పెద్ద పెద్ద వెహికల్స్లో ఎక్కడికైనా తరలించవచ్చు. మృతదేహాన్ని చాంబర్ లోపలికి పంపిస్తే.. వెంటనే గ్యాస్ బర్నర్లు ఆన్ చేస్తారు. గంటా లేదా గంటన్నర వ్యవధిలో ఒక మృతదేహం అంత్యక్రియలు పూర్తవుతాయి. స్మశాన వాటికలు లేని మారుమూల ప్రాంతాలు… నగరాలు.. ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు.. లేదా మహమ్మారులు విజృంభించినప్పుడు.. ఈ వాహనాలు మృత దేహాల దహనాలకు ఎంతగానో ఉపయోగపడతాయి.. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. పైగా స్మశాన వాటికలలో అనవసరమైన ఖర్చులు.. అటువంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా దుఃఖంలో ఉన్న సమయంలో అదనపు ఖర్చులు చెల్లించాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ వాహనంలో అయిన వారి అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించవచ్చు. అదనపు ఖర్చులు లేకుండానే అంతిమయాత్ర సాగించవచ్చు. కోవిడ్ సమయంలో గనుక ఈ వాహనం అందుబాటులోకి వచ్చి ఉంటే పరిస్థితి అంత దారుణంగా ఉండేది కాదు. మృతదేహాలను సామూహికంగా దహనం చేయాల్సిన దుస్థితి ఉండేది కాదు. ఆలస్యంగా నైనా ఇటువంటి యంత్రాలు రావడం వల్ల కష్టకాలంలో చాలామందికి ఉపయోగకరంగా ఉంటున్నది. పైగా ఈ యంత్రాలను కోయంబత్తూర్ కంపెనీ యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తూ అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నది.. గ్యాస్ ద్వారా ఏవైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ కంపెనీ ఎలక్ట్రిక్ విధానంలో పని చేసే యంత్రాన్ని తయారుచేస్తోంది. దీనికి జనరేటర్ వ్యవస్థను కూడా అనుసంధానించే ప్రయత్నాన్ని చేపడుతోంది.