Homeఎంటర్టైన్మెంట్పవన్ సినిమా నేరుగా ఓటీటీలోకి ?

పవన్ సినిమా నేరుగా ఓటీటీలోకి ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో నాలుగు వారాల్లో ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కానుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ఈ ‘పింక్’ తెలుగు రీమేక్ పై పవన్ అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేయాలని […]

Vakeel Saab
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో నాలుగు వారాల్లో ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కానుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ఈ ‘పింక్’ తెలుగు రీమేక్ పై పవన్ అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీపావళికి రేపు అధికారికంగా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారని కూడా వినిపించింది. కానీ, జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతుంది.

Also Read: ప్చ్.. ‘ప్రగతి’ ఆంటీ హీరోయిన్ గా చేస్తోందట !

మరి, కరోనా పెరుగుతున్న దృష్ట్యా పవన్ లాంటి హీరో సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తే.. రద్దీ ఎక్కువ అవుతుందని.. అది అంత మంచింది కాదు అని పవన్ కి కొంతమంది సూచించనట్లు తెలుస్తోంది. దాంతో తన సినిమా థియేటర్ లో విడుదల అనేది పవన్ ఆసక్తి చూపించట్లేదట. కానీ సంక్రాంతి సూపర్ స్పెషల్‌గా పవన్ సినిమా ఉండబోతుంది. అమెజామ్ ప్రైమ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి పవన్ ఫ్యాన్స్ కి ఒక భయం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, పైగా ఎంటర్ టైన్మెంట్ కి కూడా ఈ సినిమాలో పెద్దగా స్కోప్ ఉండదు.

Also Read: తన బయోపిక్ ‘ఆకాశం నీ హద్దురా’పై స్పందించిన కెప్టెన్ గోపీనాథ్

అందుకే ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుంటే… అది ఓవర్ హైప్ క్రియేట్ అయి అసలుకే మోసం వస్తోందని మేకర్స్ బాధ. అయితే సినిమా బాగుంది అని రిపోర్ట్స్ బయటకు వస్తే మాత్రం.. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ అవ్వడం గ్యారంటీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పవన్ శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ ఆశ కూడా ఈ సినిమాతో తీరుతుంది. ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper