Homeఎంటర్టైన్మెంట్పవన్ కళ్యాణ్ మొద‌టి భార్య‌ పేరు మారింది.. ఎక్క‌డ ఉందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మొద‌టి భార్య‌ పేరు మారింది.. ఎక్క‌డ ఉందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ.. ఏ కార‌ణాల‌వ‌ల్ల అలా చేయాల్సి వ‌చ్చిందో మాత్రం బ‌య‌టి వారికి తెలియ‌దు. ఎవ‌రికి తెలిసిన ఊహాగానాలు వారు మాట్లాడుతుంటారు. ప‌వ‌న్ ను స‌మ‌ర్థించే వారు పాజిటివ్ గా మాట్లాడితే.. వ్య‌తిరేకించేవారు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. చివ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు కూడా అలాగే మాట్లాడారు. అయితే.. తాను చ‌ట్ట ప్ర‌కారం విడాకులు తీసున్నాన‌ని, కొంద‌రు నేత‌ల మాదిరిగా చాటుమాటు వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డం లేద‌ని ఘాటుగా కౌంట‌ర్ […]

Pawan First Wife
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ.. ఏ కార‌ణాల‌వ‌ల్ల అలా చేయాల్సి వ‌చ్చిందో మాత్రం బ‌య‌టి వారికి తెలియ‌దు. ఎవ‌రికి తెలిసిన ఊహాగానాలు వారు మాట్లాడుతుంటారు. ప‌వ‌న్ ను స‌మ‌ర్థించే వారు పాజిటివ్ గా మాట్లాడితే.. వ్య‌తిరేకించేవారు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. చివ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు కూడా అలాగే మాట్లాడారు. అయితే.. తాను చ‌ట్ట ప్ర‌కారం విడాకులు తీసున్నాన‌ని, కొంద‌రు నేత‌ల మాదిరిగా చాటుమాటు వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డం లేద‌ని ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు ప‌వ‌న్‌.

Also Read: హ్యాపీ ఉమెన్స్ డే.. మ‌న హీరోలు ఎలా చెప్పారో తెలుసా?

ఇదిలాఉంటే.. ప‌వ‌న్ మొద‌టి భార్య నందిని అన్న విష‌యం కూడా చాలా మందికి తెలుసు. కానీ.. అంత‌కు మించిన వివ‌రాలు మాత్రం తెలియ‌వు. ప‌వ‌న్ ఆమెను 1995లో వివాహం చేసుకున్నారు. ఆమెది విశాఖ ప‌ట్నం. కొద్దిమంది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఘ‌నంగా పెళ్లి జ‌రిగింది. అయితే.. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు.

ఈ విష‌యంలో ప‌వ‌న్ పై నందిని కేసు కూడా పెట్టింది. ఈ వివాదం కొంత కాలం కొన‌సాగింది. ఆ త‌ర్వాత 2008లో నందిని నుంచి విడాకులు తీసుకున్నాడు ప‌వ‌న్‌. ఆ త‌ర్వాత బ‌ద్రి సినిమాలో త‌న‌తోపాటు న‌టించిన రేణుదేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. రేణుతోనూ విభేదాలు రావ‌డంతో ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ర‌ష్య‌న్ న‌టి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు ప‌వ‌న్‌. వీరికి ఒక పాప‌, బాబు ఉన్నారు.

Also Read: ‘సారంగ ద‌రియా’ క్రెడిట్ ఎవ‌రిది? కొన‌సాగుతున్న ర‌చ్చ‌!

అయితే.. ప‌వ‌న్ తో విడిపోయిన రేణూ దేశాయ్ పుణెలో ఉంటోంది. పిల్ల‌ల‌ను త‌నే పెంచుకుంటోంది. ఈ విష‌యం కూడా చాలా మంది‌కి తెలుసు. కానీ.. మొద‌టి భార్య ఏం చేస్తోంది అన్న‌ది మాత్రం తెలియ‌దు. అయితే.. మొద‌టి భార్య నందిని విడాకులు తీసుకున్న త‌ర్వాత త‌న పేరు మార్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె పేరు జాహ్న‌వి. 2010లో కృష్ణారెడ్డి అనే డాక్ట‌ర్ ను పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం అమెరికాలో నివ‌సిస్తున్న‌ట్టు స‌మాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper